ఇళయరాజా మ్యూజికల్ ఈవెంట్‌కు కేటీఆర్, చిరంజీవి, నాగార్జున.. వేడుక ఎప్పుడు? ఎక్కడంటే?
స్వర జ్ఞాని, లయ రాజ ఇళయరాజా మ్యూజికల్ లైవ్ ఫెర్ఫార్మెన్స్‌కు హైదరాబాద్ సిద్దమైంది. ఫిబ్రవరి 25, 26వ తేదీల్లో గచ్చిబౌలి స్టేడియంలో జరిగే ఈ బ్రహ్మండమైన వేడుకకు భారీగా ఏర్పాట్లు జరిగాయి. హైదరాబాద్ టాకీస్ వ్యవస్థాపకులు మల్కాపురం సాయినాథ్ గౌడ్ ఈ వేడుకను కనివినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మ్యూజికల్ లైవ్ పెర్ఫార్మెన్స్ కార్యక్రమానికి ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్, మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున హాజరుకానున్నారు. ఈ వేడుక గురించి ప్రముఖులు స్పందించిన తీరు విషయంలోకి వెళితే..
చిరంజీవి మాట్లాడుతూ.. సినీ సంగీత ప్రపంచానికి ఇళయరాజా చేసిన సేవని గుర్తు చేసుకుంటూ ఆయనను సత్కరించుకోవడం తెలుగు ప్రజలకు అవసరం. ఆయనతో వేదిక పంచుకొనే అవకాశం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను నటించిన ఎన్నో చిత్రాలకి ఆయన సూపర్ హిట్ పాటలు అందించారు. ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టం అని అన్నారు.

ఇళయరాజా సంగీతం అందించిన ఎన్నో సూపర్ హిట్ పాటలు నా చిత్రాల్లోనివే అవ్వడం నా అదృష్టం. గీతాంజలి పాటలు ఆయన అందించిన అద్భుతమైన సంగీతం వల్లే గీతాంజలి సినిమా పాటలను ఇప్పటికీ ఇష్టపడుతున్నారనటంలో అతిశయోక్తి లేదు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు వేదిక పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అని నాగార్జున అన్నారు.
ఇళయ రాజా సంగీత విభావరికి ముందు రోజు ఫిబ్రవరి 25వ తేదీన ఆయన గౌరవార్థం జరిగే వేడుకలో సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్, విశాల్ చంద్రశేఖర్, హైదరాబాద్‌కు చెందిన పాపులర్ బ్యాండ్లు, గాయకులు పాల్గొననున్నారు. ఇక ఫిబ్రవరి 26 తేదీన గచ్చిబౌలి స్టేడియంలో జరిగే సంగీత విభావరిలో వేదికపై 80 మంది సంగీత కళాకారులతో మ్యాస్ట్రో ఇళయరాజా 20000 మందికిపైగా సంగీత అభిమానులను తన మ్యూజిక్‌తో ఉర్రూతలూగించనున్నారు.
హైదరాబాద్ టాకీస్ వ్యవస్థాపకుడు మల్కాపురం సాయినాథ్ గౌడ్ మాట్లాడుతూ.. చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఎంతో మంది ఇళయరాజా అభిమానులకి మా సంస్థ ఆధ్వర్యంలో జరగనున్న భారీ కాన్సర్ట్ కన్నుల పండుగగా నిలవనున్నది అని అన్నారు.


Click it and Unblock the Notifications











