అంతకంటే ఏమీ అడగలేను.. లవ్యూ మామ అంటూ చిరుపై సాయి ధరమ్ తేజ్ ట్వీట్
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ బర్త్ డే నేడు (అక్టోబర్ 15). ఈ సందర్భంగా సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం నుంచి బ్రేకప్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. అది కూడా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేయించడంతో సుప్రీం హీరో గాల్లో తేలిపోతోన్నాడు. ఇంతకంటే గొప్ప గిఫ్ట్ ఇంకేదైనా ఉంటుందా అంటూ సంబరపడిపోతున్నాడు. ప్రస్తుతం చిరు ట్వీట్, ఆ ట్వీట్‌కు సాయి ధరమ్ తేజ్ ఇచ్చిన రిప్లై ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది.
హ్యాపీ బర్త్ డే డియర్ సాయి ధరమ్ తేజ్.. సోలో ఉన్నంత వరకు ఫుల్ ఎంజాయ్ చేయ్.. ఎలాగూ నీ సోలో డేస్ అయిపోవడానికి వచ్చేశాయ్.. లైట్ ఉన్నప్పుడే ఇంట్లో పార్టీ చేసుకో.. అంటూ ఏదో నిగూఢ అర్థం వచ్చేలా చిరంజీవి ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్‌కు సాయి ధరమ్ తేజ్ స్పందించాడు. మెగాస్టార్ చిరంజీవిపై ఉన్న ప్రేమను కురిపించాడు.

ఇంతకంటే గొప్పగా బర్త్ డే గిఫ్ట్ కావాలని ఏం అడగగలం.. థ్యాంక్యూ మామ దీన్ని మరింత స్పెషల్ చేసినందుకు.. నీ ఆశీర్వాదం కంటే నేను ఇంకేమీ అడగలేను లవ్యూ సోమచ్.. థ్యాంక్యూ సో మచ్ మామ అంటూ సాయి ధరమ్ తేజ్ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ అమృత పాట ఓ రేంజ్‌లో క్లిక్కయింది. కాసర్ల శ్యామ్ సాహిత్యం, తమన్ ట్యూన్ బాగానే వర్కవుట్ అయ్యాయి. ఈ చిత్రంతో సుబ్బు అనే కొత్త దర్శకుడు పరిచయం కాబోతోన్నాడు. ఈ సినిమాలో నభా ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది.


Click it and Unblock the Notifications











