Waltair Veerayya టైటిల్ సాంగ్ లుక్ అదుర్స్.. గ్యాంగ్ లీడర్‌ను మించిన స్టయిల్‌తో చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా ప్రమోషన్స్ ఊపందుకొంటున్నాయి. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్లు, పాటలు సోషల్ మీడియాలోను, అభిమానుల హృదయాల్లోను సందడి చేస్తున్నాయి. నువ్వు శ్రీదేవి, నేను చిరంజీవి అనే పాట ఇటీవల రిలీజై భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకొన్నది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మరో పాటను విడుదల చేయడానికి సిద్దమవుతున్నారు. వాల్తేరు వీరయ్య సినిమా టైటిల్ సాంగ్‌ను ఎప్పుడు రిలీజ్ చేయనున్నారంటే?
వాల్తేరు వీరయ్య సినిమాలోని టైటిల్ సాంగ్‌ను డిసెంబర్ 26వ తేదీన రిలీజ్ చేస్తున్నాం. రాక్ స్టార్ దేవీ శ్రీప్రసాద్ రూపొందించిన రాకింగ్ ట్రాక్‌ను ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. చిరంజీవి స్టైలీష్ అవతారంలో కనిపించే ఈ పాట ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్‌గా ఉంటుంది. ఈ పాటకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పోర్టబుల్ గ్యాస్ బర్నర్‌ను చేతిలో పట్టుకొని కళ్లకు గాగుల్స్ పెట్టుకొని స్టైలిష్‌గా గ్యాంగ్ లీడర్ లుక్‌ను మరిపించే విధంగా చిరంజీవి కనిపించారు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి సరసన అందాల తార శృతిహాసన్ నటిస్తున్నది. జీకే మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆర్థర్ ఏ విల్సన్ సినిమాటోగ్రఫి, నిరంజన్ దేవరమనే ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్‌గా, సుస్మిత కొణిదెల క్యాస్టూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.
పక్కా మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమాకు బాబీ కథను అందించారు. కోనా వెంకట్, కే చక్రవర్తి రెడ్డి స్క్రీన్ ప్లే అందించారు. హరి మోహన్ కృష్ణ, వినీత్ పొట్లూరి రచనా సహకారాన్ని అందించారు. ఈ చిత్రం జనవరి 13వ తేదీ, 2023 రోజున రిలీజ్ అవుతున్నది.
నటీనటులు: చిరంజీవి, రవితేజ, శృతిహాసన్ తదితరులు
కథ, డైలాగ్స్, దర్శకత్వం: కేఎస్ రవీంద్ర (బాబీ)
బ్యానర్: మైత్రీ మూవీస్ మేకర్స్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
మ్యూజిక్: దేవీ శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫి: ఆర్థర్ ఏ విల్సన్
ఎడిటర్: నిరంజన్ దేవరమణే
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాశ్
సీఈవో: చెర్రీ
పీఆర్వో: వంశీ శేఖర్
రిలీజ్ డేట్: 2023-01-13


Click it and Unblock the Notifications











