For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Acharya Laahe Laahe Song: యూట్యూబ్‌లో చిరంజీవి సత్తా.. అప్పుడే అన్ని వ్యూస్

  |

  స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. బడా హీరోలు ఉన్న సమయంలోనే తన టాలెంట్‌తో స్టార్ హీరోగా ఎదిగారు మెగాస్టార్ చిరంజీవి. సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఆయన.. ఆరంభం నుంచే తన హవాను చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులు, అరుదైన ఘనతలను సైతం సొంతం చేసుకున్నారు. అదే సమయంలో ఎన్నో అవార్డులను కూడా దక్కించుకుని సత్తా చాటారు. ఇక, సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి ఫుల్ స్వింగ్‌లో కనిపిస్తున్నారు. ఈ మధ్యనే ఆయన వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నారు.

  హాట్ షోలో హద్దు దాటిన కరీనా కపూర్: బ్రాతో క్లోజప్ సెల్ఫీ.. రెచ్చిపోయి చూపించిన హీరోయిన్

  'ఖైదీ నెంబర్ 150'తో కమ్ బ్యాక్ అయిన మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన 'సైరా: నరసింహారెడ్డి' అనే సినిమా చేశారు. దీని తర్వాత సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో 'ఆచార్య' అనే మూవీ చేస్తున్నారు. దీని షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయినప్పటికీ.. అనివార్య కారణాల వల్ల ఇంకా చిత్రీకరణను పూర్తి చేసుకోలేదు. దీనికి సంబంధించి మరో రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నట్లు ఇటీవలే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా 'ఆచార్య' మూవీతో చిరంజీవి ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు.

  Chiranjeevis Acharya Laahe Laahe Lyrical Song Reach 80M Views

  కొద్ది రోజుల క్రితం 'ఆచార్య' మూవీ నుంచి 'లాహే లాహే' అంటూ సాగే ఓ మెలోడీ సాంగ్ రిలీజ్ అయింది. మణిశర్మ కంపోజ్ చేసిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. యంగ్ సింగర్స్ హారిక నారాయణన్, సాహితీ చాంగంటి ఈ పాటను ఆలపించారు. ఇక, ఈ సాంగ్‌లో సీనియర్ హీరోయిన్ సంగీతం క్లాసికల్ డ్యాన్స్, చిరంజీవి గ్రేస్ మూమెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీనికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఇది యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మెలోడీ సాంగ్ 80 మిలియన్ వ్యూస్ మార్కును చేరుకుంది.

  సుడిగాలి సుధీర్‌పై దీపిక సంచలన వ్యాఖ్యలు: వద్దన్నా ఇంటికి వస్తాడంటూ మరీ దారుణంగా!

  'లాహే లాహే' సాంగ్‌తో 80 మిలియన్ మార్కును అందుకున్న మెగాస్టార్ చిరంజీవి.. సినిమాపై అంచనాలను కూడా భారీగా పెంచగలిగారు. అంతేకాదు, ఈ పాటకు సోషల్ మీడియాలోని పలు యాప్‌లలో కూడా భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇది చాలా రోజులుగా ట్రెండ్ అవుతూనే ఉంది. ఇక, ఇప్పుడు 80 మిలియన్ దాటిన ఈ పాట త్వరలోనే వంద మిలియన్ మార్కును కూడా చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే చిరంజీవి ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరుతుంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా నుంచి మరో పాట కూడా రాబోతుందని ప్రచారం సాగుతోంది.

  Chiranjeevis Acharya Laahe Laahe Lyrical Song Reach 80M Views
  Sr NTR పై Fanism చాటుకున్న Megastar, 100వ జయంతికి రావాల్సిందే!! || Filmibeat Telugu

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ఆచార్య' మూవీలో చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా... ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోలిద్దరూ నక్సలైట్లుగా చేస్తున్నారు. ఇక, ఈ చిత్రం ఎప్పుడు విడుదల కాబోతుంది అన్న దానిపై కొద్ది రోజులుగా చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 22న దీని గురించిన ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి.

  English summary
  Megastar Chiranjeevi - Ram Charan Upcoming Film is Acharya. This movie directed by Koratala Siva. Now LaaheLaahe Lyrical Song Reach 80M Views.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X