‘చూసి నేర్చుకోకు’ అంటోన్న నితిన్.. ‘రంగ్ దే’ అప్డేట్!
నితిన్ ప్రస్తుతం రంగ్ దే సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. గతేడాది మంచి హిట్ కొట్టిన నితిన్ ఈ ఏడాది నిరాశ పరిచాడు. భీష్మతో కొట్టిన సక్సెస్.. చెక్ సినిమాతో నిలబెట్టుకోలేకపోయాడు. మంచి ప్రయత్నంగా మిగిలిన ఈ మూవీ కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయింది. అయితే నితిన్ తన దృష్టిని ఇప్పుడు రంగ్ దే సినిమా మీద పెట్టేశాడు. తన ఫోకస్ అంతా రంగ్ దే మీదనే పెట్టి ప్రమోషన్స్ చేస్తున్నాడు.
ఇప్పటికే వదిలిన పోస్టర్లు, టీజర్, సాంగ్స్ అన్నీ కూడా సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. ఈ మధ్యే షూటింగ్ కూడా పూర్తి అయింది. కరోనా, లాక్డౌన్ వల్ల సినిమా షూటింగ్ వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. అయితే మొత్తానికి సినిమాను రిలీజ్ చేసేందుకు డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. సమ్మర్ కానుకగా మార్చి 26న ఈ మూవీని రిలీజ్ చేయబోతోన్నట్టు ఎప్పుడో ప్రకటించారు.

అయితే విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెంచేస్తోంది యూనిట్, ఇప్పటికే వదలిన రొమాంటిక్ సాంగ్ క్లిక్ అయింది. బస్టాండే అనే పాట కూడా క్లిక్ అయింది. ఇక తాజాగా మరో పాటను వదిలేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. చూసి నేర్చుకోకు అనే ఈ పాటను రేపు (మార్చి 13) సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. ఈ మూవీలో కీర్తి సురేష్ నటిస్తోండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్‌పై రాబోతోన్న ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











