Konaseema Thugs దర్శకులుగా స్టార్ కొరియోగ్రాఫర్.. ప్యాన్ ఇండియా మూవీ వీడియో సింగిల్‌కు మంచి క్రేజ్!

భారతీయ సినిమా పరిశ్రమలో నటులు, సాంకేతిక నిపుణులు దర్శకత్వం బాధ్యతలు చేపట్టడం తెలిసిందే. ముఖ్యంగా కొరియోగ్రాఫర్లుగా రాణిస్తూ.. దర్శకత్వం చేపట్టి టాప్ డైరెక్టర్లుగా మారిన విషయం కూడా తెలిసిందే. ప్రస్తుతం ప్రభుదేవా, లారెన్స్ మాస్టర్ అడుగు జాడల్లో నడించేందుకు ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా గోపాల్ సిద్దమయ్యారు. బృందా మాస్టర్ దర్శకత్వం కోనసీమ థగ్స్ రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నది. గతంలో భారీ బడ్జెట్ చిత్రాలను అందించిన డిస్ట్రిబ్యూటర్ శిబు తమీన్స్ కూతురు రియా షిబు ఈ సినిమాను అందిస్తున్నారు. హెచ్ఆర్ పిక్చర్స్, జియో స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమా రూపొందుతున్నది. ఈ సినిమా వివరాల్లోకి వెళితే..

కోనసిమ థగ్స్ సినిమాలో తమీన్స్ కుమారుడు హ్రిదు హరూన్ హీరోగా సినీ తెరకు పరిచయం అవుతున్నారు. సింహా, ఆర్కే సురేష్, మునిష్కంత్, శరత్ అప్షానీ, అనస్వర రాజన్ తదితరులు నటిస్తున్నారు. కోనసీమ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కే ఈ సినిమాలో హ్రీదు ఫెర్ఫార్మెన్స్ గురించి రిలీజ్‌కు ముందే మంచి రెస్పాన్స్ వస్తున్నది. కాళికాదేవీ అమ్మవారి ఊరేగింపుకు సంబంధించిన పాట చిత్రీకరణ సినిమాకు హైలెట్‌గా మారుతుంది. ఈ పాటలో డ్యాన్స్, నృత్య సన్నివేశాలు అందర్నీ భావోద్వేగానికి గురిచేస్తుంది. వనమాలి సాహిత్యం, కాలభైరవ పాడిన పాట స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారుతాయి అని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ వస్తుండగా.. తాజాగా వీర శూర మహంకాళి వస్తోందయ్యా అనే వీడియో సాంగ్‌ను విడుదల చేయగా భారీ స్పందన వస్తున్నది.

Choreographer as director Brinda Gopals Konaseema thugs Video Lyrical Song get huge response

కోనసీమ థగ్స్ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఫిబ్రవరి, 2023 లో భారీ స్థాయిలో విడుదలకు ముస్తాబవుతున్నది.

నటీనటులు: హ్రిదు హరూన్, సింహ, ఆర్కే సురేష్, మునిష్ కాంత్, అనస్వర రంజన్, శరత్ అప్పని తదితరులు
దర్శకత్వం: బృంద
నిర్మాణం: హెచ్ ఆర్ పిక్చర్స్, రియా శిబు
సంగీతం: శామ్ సి ఎస్
డీవోపీ: ప్రీయేష్ గురుస్వామి
ప్రాజెక్ట్ డిజైనర్: జోసెఫ్ నెళ్లికల్
ఎడిటర్: ప్రవీణ్ ఆంటోనీ
యాక్షన్: ఫీనిక్స్ ప్రభు, రాజశేఖర్
క్రియేటివ్ ప్రొడ్యూసర్: ముత్తు కురుప్పయ్య
కాస్ట్యూమ్స్: మాలిని కార్తికేయన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: యువరాజ్
కో డైరెక్టర్: హరిహరకృష్ణన్ రామలింగం
డిజైనర్: కబిలన్
పీఆర్వీ: బీఏ రాజు'స్ టీం (తెలుగు)

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X