కోకా కోలా పెప్సీ మామ-అల్లుడు సెక్సీ.. అదిరిపోయే స్టెప్పులేసిన వెంకీ
నిజ జీవితంలో మామ అల్లుడైన విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య రీల్ లైఫ్‌లోనూ అవే పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. వెంకీమామ అంటూ ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్స్‌తో అంచనాలు పెంచేసిన చిత్రయూనిట్.. తాజాగా మరో పాటను రిలీజ్ చేసింది. మాస్ బీట్‌తో ఉన్న ఈ పాట అందరికీ కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది.
కోకో కోలా పెప్సీ అంటూ ఊపేస్తోన్న ఈ పాటలో సింగిల్ హ్యాండ్, బలపం పట్టి భామ వల్లో, 100% లవ్ లాంటి పదాలను వాడి పాత సినిమాలను గుర్తు చేశాడు పాటల రచయిత కాసర్ల శ్యామ్. ఇక శేఖర్ మాష్టర్ తన స్టైల్లో కంపోజ్ చేసిన స్టెప్పులు కూడా భిన్నంగా ఉన్నాయి. వెంకీ ఇది వరకు కనపడని ఎనర్జీతో డ్యాన్సులు ఇరగొట్టేసినట్టు కనిపిస్తోంది. ఈ పాటలో రాశీ ఖన్నా, పాయల్ అందాలు ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతోన్నట్లు తెలుస్తోంది.

సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీని కెఏస్ రవీంద్ర తెరకెక్కిస్తున్నాడు. పాయల్ రాజ్‌పుత్, రాశీ ఖన్నా, ప్రకాశ్ రాజ్, రాము రమేష్ లాంటి వారు ముఖ్యపాత్రలో నటిస్తోన్న ఈ మూవీకి తమన్ సంగీతాన్ని అందించాడు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తుండగా.. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 13న ప్రేక్షకులు ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











