Pushpa ఐటెం సాంగ్ కాపీ.. ఆ సినిమాలోది లేపేశారా?.. దేవిశ్రీ ప్రసాద్ ను ఆడుకుంటున్నారుగా!

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఈ సినిమా డిసెంబర్ 17 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన సమంత ఐటెం సాంగ్ ఇప్పుడు కాపీ వివాదంలో చిక్కుకుంది. ఆ వివరాల్లోకి వెళితే

 డిసెంబర్ 17 న విడుద‌ల

డిసెంబర్ 17 న విడుద‌ల

అల్లు అర్జున్, ర‌ష్మిక మంథాన ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సుకుమార్ తెర‌కెక్కిస్తున్న చిత్రం పుష్ప‌. గంధ‌పు చెక్క‌ల నేప‌థ్యంలో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాను తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల‌లో ఫ్యాన్ ఇండియా లెవల్ లో డిసెంబర్ 17 న ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్నారు.

 స‌మంత ఐటెం సాంగ్

స‌మంత ఐటెం సాంగ్

ఇక ప్రమోషన్స్ లో భాగంగా మరో పాటను రిలీజ్ చేసింది సినిమా యూనిట్. పుష్పలో స్టార్ హీరోయిన్ స‌మంత ఐటెం సాంగ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఉ అంటావా..ఊ ఊ అంటావా.అంటూ సాగే పాట‌కు సంబంధించిన లిరికల్‌ను చిత్రబ‌ృందం తాజాగా విడుద‌ల చేసింది. దేవీ శ్రీ ప్ర‌సాద్ మ‌రోసారి అదిరిపోయే మ్యూజిక్ అందించగా ఈ పాటను చంద్రబోస్ రాయగా.. ఇంద్రవతి చౌహాన్ పాడారు.

అయితే ఈ పాట నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటుండగా ఈ పాట ఎక్కడో విన్నట్టుందే అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అచ్చం సూర్య హీరోగా నటించిన 'వీడొక్కడే' సినిమాలోని 'హానీ.. హానీ' పాటలా ఉందని ట్రోల్ చేస్తున్నారు. ఈ రెండు సాంగ్స్ మ్యూజిక్ ఒకేలాగా అనిపిస్తుందంటున్నారు. అయితే ఈ సినిమా మ్యూజిక్ మీద కాపీ ఆరోపణలు రావడం ఇది మొదటి సారి కాదు.

 స్పందించలేదు

స్పందించలేదు

ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసినప్పుడు బీజీఎంను హాలీవుడ్ చిత్రం అవెంజర్స్ ఎండ్ గేమ్ నుంచి దేవీ శ్రీ కాపీ కొట్టాడని పలువరు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. టీజ‌ర్‌లోని ట్యూన్ దేవి శ్రీ ప్ర‌సాద్ ఇచ్చింది కాద‌ని, అది ప‌క్కా హాలీవుడ్ మూవీ కాపీ అని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. మ‌రి దేవి శ్రీ ప్ర‌సాద్ కాని చిత్ర బృందం కాని దీనిపై స్పందించలేదు.

కాపీ కొట్టి దొరికిపోతూ

కాపీ కొట్టి దొరికిపోతూ

ఇక దేవి శ్రీ ప్రసాద్ ఖైది నెంబర్ 150 మూవీ టీజర్ కు కాపీ మ్యూజిక్ అందించాడు అని ఆరోపణలు వచ్చాయి. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సల్మాన్ ఖాన్ సుల్తాన్ సినిమాలోని ఓ మ్యూజిక్ బిట్ యాజిటీజ్ దించేయడంతో పెద్ద ఎత్తున రాహ్హ జరిగింది. సొంత టాలెంట్ తో రాక్ స్టార్ గా అదరగొడుతున్నాడు అనుకున్న దేవి శ్రీ ప్రసాద్ కూడా అడపా దడపా కాపీ కొట్టి దొరికిపోతూ ఉండడం సంచలనంగా మారుతోంది.

ప్రీ రిలీజ్ వేడుక

ప్రీ రిలీజ్ వేడుక

ఇక ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తి సుకుంది. సెన్సార్ వాళ్ళు సినిమా ఆసాంతం చూసి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. ఇక ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్‌ కూడా పెద్ద ఎత్తున జరగనుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక డిసెంబర్ 12 వ తేదీన హైదరాబాద్‌లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరపనున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా వెల్లడించింది. దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X