సాహో సాంగ్ టీజర్ రిలీజ్.. ప్రభాస్- శ్రద్ద రొమాంటిక్ సీన్స్ అదుర్స్
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో 'సాహూ' సినిమా తెరకెక్కుతోంది. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రాబోతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాలో ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటిస్తున్నారు. శ్రద్ద కపూర్‌కి ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం. చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్ లాంటి భారీ తారాగణం పాలుపంచుకుంటున్నారు. భారీ అంచనాల నడుమ ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
ఈ సందర్బంగా సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్రయూనిట్.. తాజాగా సాహో నుంచి సెకండ్ సాంగ్ టీజర్ రిలీజ్ చేసింది. ''ఏ చోట నువ్వున్నా'' అంటూ లవ్ ట్రాక్‌లో సాగిపోతున్న ఈ పాటలో ప్రభాస్- శ్రద్ద రొమాంటిక్, లొకేషన్స్, మ్యూజిక్ హైలైట్ అవుతున్నాయి. కృష్ణ కాంత్ అందించిన లిరిక్స్ పై హరి చరణ్ శేషాద్రి, తులసి కుమార్ పాడిన ఈ పాటకు గురు రంధావా సంగీతం అందించారు. సాహో అంటే కేవలం యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా మాత్రమే కాదు రొమాటిక్ మూడ్ కూడా ఉంటుందని ఈ సాంగ్ ద్వారా తెలిపే ప్రయత్నం చేశారు యూనిట్ సభ్యులు.

ప్రభాస్ కెరీర్‌లో 'బాహుబలి' లాంటి భారీ ప్రాజెక్టు తర్వాత రాబోతున్న సినిమా కావడంతో 'సాహూ' పై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. హై టెక్నీకల్ వాల్యూస్‌తో పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను కనువిందు చేయనున్నాయి. ఈ మేరకు ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేసేలా సాహోకి సంబందించిన అప్‌డేట్స్ విడుదల చేస్తున్నారు యూనిట్ సభ్యులు. ఇందులో భాగంగా షేడ్స్ ఆఫ్ సాహో పేరిట విడుదల చేసిన వీడియోలు, ఫస్ట్ సాంగ్ భారీ హైప్ క్రియేట్ చేయగా తాజాగా విడుదలైన సాంగ్ యూత్ ఆడియన్స్‌ని అమితంగా ఆకట్టుకుంటోంది.


Click it and Unblock the Notifications











