Dasara Song: ధరణి, వెన్నెల ప్రేమ ప్రపంచం.. మరో క్యూట్ మెలోడీ సాంగ్!

నేచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా మార్చి 30వ తేదీన గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది. కీర్తి సురేష్ మెయిన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సముద్రఖని ముఖ్య పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఓవర్గం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే సంక్రాంతి తర్వాత బిగ్ బాస్ యాక్షన్ సినిమా మళ్లీ రాలేదు. కాబట్టి ఈసారి నాని ఆ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు అనే నమ్మకంతో ఉన్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగానే కొనసాగుతున్నాయి. ఇప్పటికే నాని నార్త్ స్టేట్స్ లలో కూడా సినిమాను బాగానే ప్రమోట్ చేశాడు. ముఖ్యంగా ప్రతి పాటకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇక సినిమాకు సంబంధించిన ప్రతి పాట కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది.

Dasara movie fourth song released dharani vennela beautiful childhood

ఇక కొద్దిసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన మరొక పాటను విడుదల చేశారు. 'ఓ అమ్మలాలో' అనే పాట తెలంగాణ నేపథ్యంలో చాలా చక్కగా రెహమాన్ రచించగా అనురాగ్ కులకర్ణి ఈ పాటను పాడాడు. ధరణి వెన్నెల చిన్ననాటి బంధాన్ని ప్రదర్శించే విధంగా ఈ పాటను హైలెట్ చేశారు. రెహ్మాన్ రాసిన సాహిత్యం మనల్ని లీడ్ పెయిర్ బాల్యంలోకి తీసుకువెళుతుంది.

ఈ చిన్ననాటి సీన్స్ సినిమాలో చాలా ముఖ్యమైనవి అని అర్ధమవుతోంది. పాట విజువల్స్ తో పాటు అనురాగ్ కులకర్ణి గానం సంతోష్ నారాయణన్ ట్యూన్స్ పాటను మరింత అందంగా మార్చాయి. ఈ పాట సినిమా కథాంశానికి సంబంధించి కూడా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక శ్రీకాంత్ ఒదెల ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి. గోదావరిఖని కోల్ మైన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ కూడా గట్టిగానే ఉండబోతున్నట్లు సమాచారం. ఇక ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, జరీనా వహాబ్, సాయి కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X