డియర్ కామ్రేడ్: సంగీత ప్రియులకు మత్తెక్కిస్తున్న ‘నీ నీలి కన్నుల్లోన’ సాంగ్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా భరత్ కమ్మ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం "డియర్ కామ్రేడ్". మే నెలలో ఈ మూవీ విడుదల చేస్తున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ల జోరు పెంచారు.
తాజాగా ఈ మూవీలోని ఫస్ట్ సాంగ్ 'నీ నీలి కన్నుల్లోన' అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. అద్భుతమైన మెలొడీ ట్యూన్ కట్టిన గీతానికి సంగీత ప్రియులను మత్తులోకి జారిపోయేలా చేస్తోంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించిన ఈ పాటకు రెహమాన్ లిరిక్స్ అందించారు. గౌతమ్ భరద్వాజ్ తన వాయిస్‌తో ప్రాణం పోశారు.
తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళంలో ఈ సాంగ్ రిలీజ్ చేశారు. అన్ని భాషల్లోనూ ఈ పాటను గౌతమ్ భరద్వాజ్ ఆలకించడం విశేషం. యూట్యూబ్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ సాంగ్ అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది.
విజయ్ దేవరకొండ కెరీర్లో ఒకేసారి 4 భాషల్లో విడుదలవుతున్న తొలి చిత్రం ఇదే. ఈ సినిమా ద్వార సౌత్ మార్కెట్లో తన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నాడు విజయ్ దేవరకొండ. సుజిత్ సరంగ్ సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ మూవీకి జై కృష్ణ మాటలు రాశారు. రామాంజనేయులు ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు:
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: భరత్ కమ్మ
బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్, బిగ్ బెన్ సినిమాస్
నిర్మాతలు: నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ చిరుకూరి(సి.వి.ఎం), యస్ రంగినేని
సి.ఈ.ఓ: చెర్రి
కో ప్రొడ్యూసర్: ప్రవీణ్ మర్పురి
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
కెమెరామెన్: సుజిత్ సరంగ్
ఎడిటర్: శ్రీజిత్ సరంగ్
డైలాగ్స్ : జై కుమార్
ఆర్ట్ డైరెక్టర్: రామాంజనేయులు.


Click it and Unblock the Notifications











