Deepthi Sunaina: నిర్మాతగా మారిన దీప్తి సునైనా.. షణ్ముఖ్ తో కలిసి ఆ వీడియో!
గతంలో కంటే సోషల్ మీడియా వాడకం తెగ పెరిగిపోయింది. సోషల్ మీడియాను మంచి సాధనంగా ఉపయోగించుకుంటూ అనేక మంది పాపులర్ అయ్యారు. నెట్టింట్లో సందడి చేస్తూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న క్యూట్ బ్యూటి దీప్తి సునైనా. అందానికి అందం, టాలెంట్‌కు టాలెంట్ ఉన్న అమ్మాయి కావడంతో ఈ భామ చాలా తక్కువ సమయంలోనే మోస్ట్ పాపులర్ అయింది. తద్వారా బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో రెండో సీజన్ లో ఛాన్స్ కూడా దక్కించుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ సందడి చేస్తూ పలు కవర్ సాంగ్స్ తో అలరిస్తోంది. ఇప్పటివరకు తన అందంతో ఆకట్టుకున్న ఈ బిగ్ బాస్ బ్యూటి తాజాగా నిర్మాతగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

ఎంతో మందికి క్రష్ గా..
సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వాళ్లలో దీప్తి సునైనా ఒకరు. తనదైన అందం, నటన, డ్యాన్స్ లతో అట్రాక్ట్ చేసే దీప్తి సునైనా అప్పుడప్పుడూ హాట్ షోతో మెప్పిస్తూ ఇంటర్నెట్‌లో సెన్సేషన్ గా మారిపోయింది. మరీ ముఖ్యంగా కొన్ని డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు ఆమెకు భారీ స్థాయిలో గుర్తింపును తీసుకు వచ్చాయి. ఫలితంగా ఈ భామ ఎంతో మందికి క్రష్‌గా మారిపోయింది.

హీరో తనిష్ తో..
అతి తక్కువ సమయంలోనే ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న దీప్తి సునైనాకు బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. అందులో ఆటతో పాటు గొడవలు, గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టింది. అలాగే, హీరో తనీష్‌తో చనువుగా ఉంటూ హాట్ టాపిక్ అయింది. ఇక, ఈ షో వల్ల ఈ బ్యూటీ రేంజ్ పెరగడంతో పాటు వరుసగా ఆఫర్లను కూడా దక్కించుకుని హవాను చూపింది. కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న సమయంలోనే ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌తో సుదీర్ఘ కాలం పాటు లవ్ ట్రాకు నడిపించింది క్యూట్ బ్యూటి.

మ్యూజిక్ ఆల్బమ్స్ తో..
అలా ప్రేమాయణంతో మరింతగా పాపులర్ అయిపోయారు షణ్ముఖ్ జస్వంత్ అండ్ దీప్తి సునైనా. అలా చాలా కాలం ప్రేమించుకున్న తర్వాత అంటే ఇటీవలే దీప్తి సునైనా.. షన్నూకు బ్రేకప్ చెప్పేసింది. ఈ వ్యవహారం అప్పుడు సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ అయిపోయింది. యూట్యూబర్‌గా కెరీర్‌ను ఆరంభించిన కొత్తలోనే దీప్తి సునైనా వరుసగా వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్స్, డ్యాన్స్ వీడియోలతో హవాను చూపించింది.

సినీ కెరీర్ కు సంబంధించిన..
సోషల్ మీడియాతోపాటు అటు బుల్లితెర, ఇటు వెండితెరపై అవకాశాలను దక్కించుకుంది దీప్తి సునైనా. అయితే, చాలా కాలం పాటు గ్యాప్ తీసుకున్న ఆమె.. ఇప్పుడు కెరీర్‌పై దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగానే మళ్లీ స్పీడ్ పెంచుతోంది. సోషల్ మీడియా ద్వారా బిగ్ సెలెబ్రిటీగా మారిన దీప్తి సునైనా.. అందులో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, తనఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ క్రేజ్‌ను పెంచుకుంటోంది.

మ్యూజిక్ వీడియోతో..
ఇప్పటికే అనేక కవర్ సాంగ్స్ తో అలరించింది క్యూట్ బ్యూటి దీప్తి సునైనా. ఏమై ఉండొచ్చో, మలుపు, తట్టుకేలేదే వంటి తదితర సాంగ్స్ తో పాటు పలు హిట్ అయిన సినిమా సాంగ్స్ ను రీ క్రియేట్ చేసి వదిలింది. ఇప్పుడు మరో కొత్త వీడియో సాంగ్ తో రాబతోంది ఈ బ్యూటిఫుల్ ముద్దుగుమ్మ. ఏమోనే అనే కొత్త ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియోతో మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతోంది దీప్తి సునైనా.
మంచి మ్యూజిక్ తో ఆకట్టుకునేలా..
దీప్తి సునైనా తాజా వీడియో సాంగ్ ఏమోనే కుసంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ను సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ ఏమోనే పాట టీజర్ ను జనవరి 3న అంటే రేపు మంగళవారం విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. అలాగే ఈ వీడియోకు సంబంధించిన చిన్న ప్రోమోను కూడా వదిలింది ఈ బ్యూటి. మంచి మ్యూజిక్ తో ఆకట్టుకునేలా ఉంది ఏమోనే సాంగ్. ఈ ప్రోమోతో వీడియోపై క్యూరియాసిటీ క్రియేట్ చేసింది.
మరోసారి షణ్ముఖ్ దర్శకత్వంలో
ఏమోనే వీడియో సాంగ్ లో దీప్తి సునైనా, విశాల్ జంటగా కనిపించనున్నారు. ఈ పాటకు దర్శకత్వంతోపాటు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ బాధ్యతలను వినయ్ షణ్ముఖ్ నిర్వహిస్తున్నాడు. విజయ్ బల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు. అంతేకాకుండా ఈ వీడియో సాంగ్ తో దీప్తి సునైనా నిర్మాతగా మారుతోంది. మకా సంపత్ కుమార్ తో కలిసి నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. ఇది వరకు వచ్చిన తట్టుకోలేదే బ్రేకప్ సాంగ్ కు కూడా షణ్ముఖ్ కథ, దర్శకత్వం, డీఓపీ, ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు.


Click it and Unblock the Notifications











