కొత్త కాన్సెప్ట్‌తో దేవదాస్ డాన్స్ వీడియో.. మీరు రెడీనా అంటున్న నాని!

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ఆసక్తిని రేపుతోంది. ఈ చిత్రంలో నాగార్జున డాన్ పాత్రలో, నాని డాక్టర్ గా నటిస్తున్నారు. యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని పూర్తి వినోదాత్మక చిత్రంగా రూపొందిస్తున్నారు. ఇటీవల వినాయక చవితి సందర్భంగా విడుదల చేసిన పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సాంగ్ డాన్స్ వీడియోని కొద్దీ సేపటిక్రితమే విడుదల చేశారు.

వినాయక చవితి సంబరాలలో నాగార్జున, నాని రంగుల్లో చిందేస్తున్నారు. తమలాగే మీరు కూడా గణేష్ ఉత్సవాలలో డాన్స్ చేసి ఆ వీడియోని డాన్స్ విత్ దేవదాస్ హ్యాష్ ట్యాగ్ కు జతచేస్తే.. అందులో బెస్ట్ వీడియోల్ని ఎంపిక చేసి అద్భుతమైం బహుమతులు పంపుతామని నాని తెలిపాడు. నాని ఈ వీడియోని ట్విట్టర్ లో షేర్ చేస్తూ మేము రెడీ మీరు రెడీనా అంటూ కామెంట్ పెట్టాడు.

సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సెప్టెంబర్ 27 న ఈ చిత్రం విడుదల కానుండడంతో చిత్ర యూనిట్ ప్రచురకార్యక్రమాల వేగం పెంచింది.వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Devadas movie Nagarjuna, Nani dance video

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X