Devaki Nandana Vasudeva Music Review: జోష్ పుట్టించేలా కృష్ణాష్టమి సాంగ్.. జో బోలో కృష్ణా ట్రెండింగ్
యువ హీరో అశోక్ గల్లా, హీరోయిన్ మానస వారణాసి జంటగా నటించిన చిత్రం దేవకీ నందన వాసుదేవ. లలితాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో సోమినేని బాలకృష్ణ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది.
ఇటీవల కాలంలో సంచలన రీతిలో హిట్ మ్యూజిక్ ఆల్బమ్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన భీమ్స్ సిసిరోలీయో సంగీత దర్శకత్వం వహించారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలై ట్రెండింగ్‌గా నిలిచాయి. సంగీత ప్రియులను ఆకట్టుకొంటున్న ఈ సినిమాలోని పాటల వివరాల్లోకి వెళితే..
నంద నంద నందనాల బాల బాల గోపాల
వంద వంద వదనాల గోపాల బాల నందనాల
సంబరాలు అంబరాలు తాకేనంట
లోకమంత ఏకమై చాటుతుంది కృష్ణ లీల..
గోకులంలా మారేనంతా వాకిలంత తోరణాలు

థక్ ధీం తక.. దరువేయరా!
ఊరు వాడ.. ఊగాలిలిక
జన్మాష్టమి.. జరిపేద్దాము
జన్మంత గుర్తుండేలా
బరిలో దూకి..
దమ్మెంతుందో
చూపించేలా
ఢీ కొడుతా రా..
దోస్తికైనా..
కుస్తీకైనా..
దస్తీ తీసి..ఎగురేస్తాను రా..
వైభవంగా ఉండే
వైబే అంటే నాదే
వాస్తవంగా మారే
వాస్తు కూడా నాదే
నేను బదులే చెప్పి
ఆట మొదలే పెడితే..
ఇక ల్యాగే లేనీ
స్వాగే లే ...
జై కృష్ణ..
జై కృష్ణ
జై బోలో కృష్ణ అంటూ సాగే పాటకు రఘురాం సాహిత్యం అందించగా.. స్వరాగ్ కీర్తన్ ఆలపించారు. ఈ పాటకు భీమ్స్ సంగీతం అందించగా.. హుషారుగా సాగే పాటే సాంగ్‌కు యష్ మాస్టర్ కొరియోగ్రఫిని అందించారు.
యూత్‌ఫుల్‌గా, జన్మాష్టమికి అందరూ పాడుకొంటూ డ్యాన్స్ చేసే విధంగా ఈ పాటను స్వరపరిచారు. ప్రస్తుతం అందర్నీ ఆకట్టుకొంటూ యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతున్నది. మే 31వ తేదీన రిలీజైన ఈ పాట ఇప్పటికే 2 లక్షల వ్యూస్‌కు చేరువైంది. ఈ సినిమాకు ఈ పాట హైలెట్‌గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు అని సంగీత ప్రియులు పేర్కొంటున్నారు.

ఈ మూవీ సాంకేతిక నిపుణుల వివరాలు
దర్శకత్వం: అర్జున్ జంధ్యాల
స్టోరి: ప్రశాంత్ వర్మ
సమర్పణ: నల్లపనేని యామిని
డీవోపీ: ప్రసాద్ మూరేళ్ల, రసూల్ ఎల్లోర్
ఎడిటర్: తమ్మిరాజు
డైలాగ్స్: బుర్రా సాయిమాధవ్
ఆర్ట్: జీఎం శేఖర్


Click it and Unblock the Notifications











