Devara's Daavudi Song Review: దావుడి సాంగ్ రివ్యూ.. స్టెప్పులతో దడదడలాడించిన ఎన్టీఆర్, జాన్వీ!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, యంగ్ సెన్సేషన్ జాన్వీ కపూర్ జంటగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం దేవర. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీ ఖాన్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై కల్యాణ్ రామ్, మిక్కిలేనేని సుధాకర్, హరికృష్ణ కే నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమంలో భాగంగా దావుడి అనే పాటను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఈ పాటకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
దక్షిణాదిలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ ఇప్పటికే హిట్ అయింది. ఇటీవల రిలీజ్ చేసిన చుట్టమల్లే పాటకు రికార్డు వ్యూస్ లభించాయి. మ్యూజిక్ ఆల్బమ్‌లోని పాటలు సెన్సేషన్‌గా మారడంతో సినిమాపై కూడా భారీ అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ నేపథ్యంలో దావుడి పాటను రిలిజ్ చేశారు. మంచి బీట్‌తో సాగే ఈ పాట విన్న వెంటనే కిక్కించేలా అనిపించిందని నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు.

దావుడీ పాటపై ఎన్టీఆర్, జాన్వీ కపూర్ వేసిన స్టెప్పులు కుర్రకారును కూత పెట్టించేలా చేసింది. ఆ పాటలో లయబద్దంగా ఎన్టీఆర్‌తో శ్రీదేవీ పోటాపోటీగా వేసిన డ్యాన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ పాటకు ప్రముఖ కోరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నృత్యాలు సమకూర్చారు. ఫస్ట్ లుక్‌తోనే ఈ పాట మంచి క్రేజ్‌ను సంపాదించుకొన్నది.
దేవరలో దావుడి సాంగ్‌ను అనిరుధ్ ఫ్యాన్స్‌తో విజిల్స్ వేయించేలా కంపోజ్ చేశారు. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి తెలుగులో రాశారు. తమిళంలో విఘ్నేష్ శివన్, హిందీలో కౌసర్ మునీర్, కన్నడలో వరదరాజ్ చిక్‌బల్లాపుర, మలయాళంలో మాన్‌కొంబు గోపాలకృష్ణ సాహిత్యం అందించారు. ఇక ఈ పాటను నకష్ అజీజ్, ఆకాశ గాయని గాయకులు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఆలపించారు. నకష్ అజీజ్, రమ్యా బెహ్రా తమిళ, మలయాళంలో పాటను పాడారు.
తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న దేవర చిత్రం సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ద్వారా జాన్వీ కపూర్ తొలిసారి తెలుగులోకి అడుగు పెడుతున్నారు. ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా, సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











