వినయ విధేయ రామలో మాస్ డ్యూయెట్!

మెగా పవర్ స్టార్ రాంచరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వినయ విధేయ రామ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల విడుదల చేసిన టీజర్ ఊర మాస్ గా ఉండడంతో మరోమారు బోయపాటి మ్యాజిక్ ఖాయం అని అంచనా వేస్తున్నారు. బోయపాటి శ్రీను చిత్రాలు ఎక్కువగా మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసే విధంగా ఉంటాయి. అదిరిపోయే ఇంటర్వెల్ బ్యాంగ్, ఐటం సాంగ్ లాంటి అంశాలతో బోయపాటి అలరిస్తారు.

దాదాపు ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. త్వరలో రాంచరణ్, కైరా అద్వానీపై బోయపాటి అదిరిపోయే మాస్ మసాలా సాంగ్ ని చిత్రీకరించనున్నారట. దేవిశ్రీ ప్రసాద్, బోయపాటిది సూపర్ హిట్ కాంబినేషన్. అద్భుతమైన ఆల్బమ్ ని దేవిశ్రీ నుంచి ఎక్స్ పెక్ట్ చేయవచ్చు.

Devi Sri prasad composed mass song for Vinaya Vidheya Rama

డివివి దానయ్య ఈ చిత్రానికి నిర్మాత. వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తుండడం ఉత్కంథ రేపుతోంది. ఆర్యన్ రాజేష్, సీనియర్ హీరోయిన్ స్నేహ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రం విడుదుల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X