సమంత, పూజా, తమన్నా, శ్రీలీలా.. స్టార్ భామలతో దేవీశ్రీ సరికొత్త రికార్డు.. ఏంటంటే?
ఇండియాలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవీశ్రీ ప్రసాద్ గుర్తింపు పొందారు. ఇండియాలోనే కాకుండా తన సంగీతంతో ఇంటర్నేషనల్ గా కీర్తి పొందారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప', 'పుష్ప 2 : ది రూల్' చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా తన పాటలతో సంగీత ప్రియులను ఆకట్టుకున్నారు. దేవీశ్రీ ప్రసాద్ తన 25 ఏళ్ల కెరీయర్ లో 100కి పైగా చిత్రాలకు సంగీతం అందించారు. మెలోడీస్, ఫాస్ట్ బీట్, పార్టీ సాంగ్స్, రొమాంటిక్ సాంగ్స్ తో పాటు స్పెషల్ సాంగ్స్ ను కూడా అందించారు. దేవీశ్రీ ప్రసాద్ అందించిన అన్నీ సాంగ్స్ హిట్ కావడం విశేషం.
అయితే దేవీశ్రీ ప్రసాద్ కెరీయర్ లో ఒక అరుదైన రికార్డు నెలకొనింది అని తాజాగా వెల్లడించారు. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోయిన్లకు తానే మొదటిగా స్పెషల్ సాంగ్స్ కు అదించానని చెప్పారు. ఆ రికార్డు తనకే సొంత మైందని చెప్పారు. టాలీవుడ్ లో దుమ్ములేపిన హీరోయిన్ తమన్నా భాటియాకు 'అల్లుడు శ్రీను' మూవీలో లబ్బర్ బొమ్మ అనే సాంగ్ ను అందించారు. అలాగే ఇండియాతో పాటు ప్రపంచ సంగీత ప్రియులను ఆకర్షించిన సాంగ్ 'ఊ అంటావా మావా' అనే సాంగ్ ను స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు కు అందించారు.

ఇక అదే పుష్ప 2 : ది రూల్ చిత్రంతో యంగ్ సెన్సేషన్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీలీలాకు 'కిసిక్' సాంగ్ ను అందించారు. అంతకు ముందు పూజా హెగ్దేకు రంగస్థలం చిత్రం ద్వారా 'జిగేలు రాణి' సాంగ్ ను అందించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. అయితే ఇలా దాదాపు టాలీవుడ్ లో దుమ్ములేపిన హీరోయిన్లకు తానే స్పెషల్ సాంగ్స్ ను కంపోజ్ చేసి ఇచ్చానని చెప్పుకొచ్చారు. మరోవైపు ఆ సాంగ్స్ కూడా ఎంతగానో హిట్ అవ్వడం కూడా విశేషం.
ఇక మరోవైపు దేవీశ్రీ ప్రసాద్ కేవలం మూడు నెలల్లో మూడు చిత్రాలకు బ్లాక్ బాస్టర్ హిట్ సాంగ్స్ ను అందించి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. కేవలం 100 రోజుల్లోనే కంగువా, పుష్ఫ 2, తండేల్ చిత్రాలతో హిట్ సాంగ్స్ ను అందించారు. ఆ చిత్రాల్లోని సాంగ్స్ అన్నీ యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి. ఒక్కో సాంగ్ మిలియన్ల కొద్దీ వ్యూస్ ను దక్కించుకున్నాయి. ఇలా దేవీశ్రీ ప్రసాద్ తన కెరీయర్ లో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నారు. ఇక తెలుగు ఆడియెన్స్ పల్స్ తెలుసుకొని మాస్, క్లాస్, మెలోడీ, రొమాంటిక్ సాంగ్స్ అందించడంలో దిట్ట.
కాగా దేవీశ్రీ ప్రసాద్ కు ఎక్కువ భక్తి పాటలు అంటే ఇష్టమని చెప్పారు. ఆయన మొదటి చిత్రం దేవీకి కూడా భక్తి పాటలు అందించి అదరగొట్టాడు. అప్పటి నుంచి మొదలై ఇప్పటి వరకు ఎన్నో చిత్రాలకు సూపర్ హిట్ సాంగ్స్ ను అందిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం దేవీశ్రీ ప్రసాద్ ధనుష్ 'కుబేరా', వృషభ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాలకు సంగీతం అందిస్తూ బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











