ఐదు భాషల్లో ఐటెం సాంగ్.. పుష్ప కోసం దేవీశ్రీ ప్రసాద్.. మ్యూజిక్‌తో రాక్‌స్టార్ కిర్రాక్!

స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న పుష్ప భారీ అంచనాలు పెంచేసింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. 19 రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్‌ను సాధించింది. దాంతో ఈ సినిమాపై ఏ రేంజ్ అంచనాలు పెరిగాయో స్పష్టమైంది.

 పుష్ప సినిమా హాట్ అప్‌డేట్

పుష్ప సినిమా హాట్ అప్‌డేట్

అయితే పుష్ప సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సంబంధించిన వివరాలు క్రేజీగా మారాయి. డీఎస్పీ టీమ్ ప్రస్తుతం ఏకకాలంలో ఐదు భాషల్లో పనిచేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా సింగిల్‌ను రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

ఐటెమ్ నంబర్‌గా ఫస్ట్ సింగిల్

ఐటెమ్ నంబర్‌గా ఫస్ట్ సింగిల్

ఇదిలా ఉండగా, పుష్ప ఫస్ట్ సింగిల్ ఐటెమ్ నంబర్ అనే విషయం బయటకు వచ్చింది. ఆర్యలో అ అంటే అమలాపురం, ఆర్య2లో రింగా రింగా పాట రేంజ్‌లో ఈ ఫస్ట్ సింగిల్ ఉంటుందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. మాస్, మసాలలు దట్టించి ప్రేక్షకులపైకి వదిలేందుకు దేవీ శ్రీ ప్రసాద్ సిద్ధం అవుతున్నట్టు సమాచారం.

 పుష్ప షూటింగుకు సెకండ్ వేవ్ దెబ్బ

పుష్ప షూటింగుకు సెకండ్ వేవ్ దెబ్బ

ఇక కరోనావైరస్ సెకండ్ వేవ్ ప్రభావం పుష్పపై భారీగానే పడింది. అల్లు అర్జున్‌ కరోనావైరస్ పాజిటివ్ అని తేలడంతో సినిమా షూటింగును వాయిదా వేశారు. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్న స్టైలిష్ స్టార్ కోలుకొంటున్నట్టు సమాచారం. ఆయన ఆరోగ్యం కుదుటపడగానే షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Recommended Video

Ravi Teja Replaces Chiranjeevi In Puri Jagannadh's Auto Jaani || Filmibeat Telugu
పుష్ప మూవీ గురించి

పుష్ప మూవీ గురించి

ఇక పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న పుష్ప చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో మలయాళ నటుడు ఫహద్ పాజిల్, ప్రకాశ్ రాజ్, జగపతిబాబు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 13వ తేదీన రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే కరోనా కారణంగా ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్‌లో రిలీజ్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X