‘ఉప్పెన’పై అంచనాలు పెంచేస్తోన దేవీ శ్రీ ప్రసాద్.. ఆ సాంగ్ హైలెట్ కానుందట!!
ప్రస్తుతం దేవీ శ్రీ ప్రసాద్ హవా తగ్గిందని అందరూ అనుకుంటున్నారు. ఓ వైపు తమన్ దూసుకెళ్తుండటంతో దేవీ శ్రీ ప్రసాద్‌పై కాస్త నెగెటివిటీ పెరుగుతోంది. తన స్థాయిలో ఆల్బమ్స్ ఇవ్వడం లేదని, మ్యూజిక్ సరిగ్గా కొట్టడం లేదని అందరూ అంటున్నారు. కానీ దేవీ శ్రీ ప్రసాద్ ఆ మధ్య కొన్ని కామెంట్లు చేశాడు. కథకు తగ్గట్టు తాను సంగీతం ఇస్తానని, తన నుంచి ఇకపై వచ్చే చిత్రాలు, అందులోని సంగీతం మిమ్మల్ని ఆశ్చర్య పరుస్తుందని సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్స్‌లో చెప్పుకొచ్చాడు.
దేవీ శ్రీ ప్రసాద్ చెప్పినట్టే ఉప్పెన, రంగ్ దే వంటి సినిమాలకు ఆయన కొట్టిన సంగీతం చూస్తే మళ్లీ మునుపటి రోజుల్లోకివెళ్లినట్టు అనిపిస్తుంది. ప్రేమ కథ చిత్రాలకు, లవ్ సాంగ్స్‌కు దేవీ శ్రీ ప్రసాద్ పెట్టింది పేరు. ఇప్పటికే ఉప్పెన, రంగ్ దే పాటలు అందరికీ ఎక్కేశాయి. అలాంటి తరుణంలో ఉప్పెనలోని మరో పాట గురించి అప్డేట్ వచ్చింది. ఆ పాటను త్వరలోనే రిలీజ్ చేయబోతోన్నట్టు తెలుస్తోంది.

రోల్డాన్ అనే సింగర్ ఆ పాటను పాడినట్టున్నాడు. ఉప్పెన ఆల్బమ్ అద్భుతంగా వచ్చింది.. ఈ పాటను ఈ ప్రపంచం ఎప్పుడు వింటుందా? అని ఎదురుచూస్తున్నాను.. ఉప్పెన అనేది ఓ క్లాసిక్ అవుతుంది.. ఈ పాట శాశ్వతంగా నిలిచిపోతుంది.. మీరు చేసిన ఈ మ్యాజిక్‌లో తాను ఈ పాట పాడినందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. దీంతో దేవీ అందించిన ఆ పాటపై ఇప్పటి నుంచే చర్చ మొదలైంది.


Click it and Unblock the Notifications











