ఖిలాడీ కోసం దేవీ శ్రీ ప్రసాద్.. ‘మాస్’ బీట్స్‌తో రాక్ స్టార్ రచ్చ
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం క్రాక్ సినిమాను పూర్తి చేసేశాడు. అసలే వరుసగా ఫ్లాపులో తన అభిమానులను నిరాశపర్చుతూ వస్తున్నాడు. చివరగా ఎన్నో అంచనాల నడుమ వచ్చిన డిస్కో రాజా సినిమా బోల్తా కొట్టింది. అయితే రవితేజ మాత్రం తన క్రాక్ సినిమాపైన భారీ అంచనాలే పెట్టుకున్నాడు. పోస్టర్లు, సాంగ్, టీజర్‌ను చూసిన అభిమానులు కూడా సినిమాపై ఆశలు పెట్టుకున్నారు.
మొత్తానికి ఈ మూవీ షూటింగ్ పూర్తైంది. ఎప్పుడో సమ్మర్ కానుకగా రావాల్సిన సినిమా సంక్రాంతి బరిలోకి దిగేలా ఉంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలె పూర్తి అయింది. గోవాలో చివరి షెడ్యూల్‌లో సాంగ్‌ను షూట్ చేసి ప్యాకప్ చెప్పేశారు. ఇది అలా ఉంచితే రవితేజ కొత్త సినిమా అప్డేట్ ఒకటి వచ్చింది. క్రాక్ సినిమా తరువాత రవితేజ రమేష్ వర్మతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య ఖిలాడీ అంటూ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ బాగా వైరల్ అయింది.

రవితేజ రమేష్ వర్మ కాంబోలో వీర అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అది నిరాశ పరిచినా కూడా ఖిలాడితో మరో అవకాశాన్నిచ్చాడు రవితేజ. ఈ మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయని దర్శకుడు తెలిపాడు. మాస్ మహారాజ కోసం రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మాస్ బీట్స్‌ను ట్యూన్ చేస్తోన్నాడని తెలుస్తోంది. ఖిలాడీ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలుపెట్టనున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











