For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘పుష్ప’ నుంచి పండుగలాంటి వార్త: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. అతడి కెరీర్‌లోనే మొదటిసారి

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకుని.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా వెలుగొందుతున్నాడు. ఇక, గత ఏడాది 'అల.. వైకుంఠపురములో' సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్న అతడు.. ఆ ఉత్సాహంతోనే ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ గురించి ఓ పండుగ లాంటి వార్త బయటకు వచ్చింది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు పూనకాలే అంటున్నారు. ఆ సంగతులు మీకోసం!

  స్మగ్లర్‌ పుష్పరాజ్‌గా మారిన బన్నీ

  స్మగ్లర్‌ పుష్పరాజ్‌గా మారిన బన్నీ

  ‘అల.. వైకుంఠపురములో' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తోన్న చిత్రం ‘పుష్ప'. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను మైత్రీ సంస్థ నిర్మిస్తోంది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. అనసూయ భరద్వాజ్ కూడా ఇందులో భాగం అయింది.

  రామ్ చరణ్ - శంకర్ మూవీ నుంచి సర్‌ప్రైజ్: బర్త్‌డే కానుకగా ప్రకటన.. అది ఫ్లాప్ అయినా మరో ఛాన్స్

   ఐకాన్ స్టార్‌గా అయ్యేందుకు కొత్తగా

  ఐకాన్ స్టార్‌గా అయ్యేందుకు కొత్తగా

  నిన్న మొన్నటి వరకూ అల్లు అర్జున్‌కు స్టైలిష్ స్టార్ అనే బిరుదు ఉండేది. అయితే, ఇప్పుడతను ‘పుష్ప'తో ఐకాన్ స్టార్‌గా మారాడు. అంతలా ఈ సినిమాలో ఈ స్టార్ హీరో సాహసాలు చేయబోతున్నాడట. ఈ ఒక్క సినిమా కోసమే కొండ ప్రాంతాల్లో లారీ డ్రైవింగ్‌తో పాటు రియల్ స్టంట్స్, చిత్తూరు యాసలో డైలాగులు, డీ గ్లామర్‌ లుక్‌తో పాటు ఎన్నో కొత్తగా ట్రై చేస్తున్నాడని టాక్.

   రెండు భాగాలుగా వస్తున్న ‘పుష్ప'

  రెండు భాగాలుగా వస్తున్న ‘పుష్ప'

  పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ‘పుష్ప' మూవీని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి భాగానికి సంబంధించిన 90 శాతం షూటింగ్ పూర్తైంది. అలాగే, రెండో పార్ట్‌ కోసం దాదాపు 30 శాతం చిత్రీకరణ జరిపారు. ఇక, ఇప్పుడు మొదటి దాని కోసం షూట్ చేస్తున్నారు. ఇది అయిపోయిన వెంటనే విడుదలకు సిద్ధం చేయనున్నారు.

  రిలీజ్‌కు ముందే సెన్సేషనల్ రికార్డ్

  రిలీజ్‌కు ముందే సెన్సేషనల్ రికార్డ్

  కొద్ది రోజుల క్రితం ‘పుష్ప' మూవీ నుంచి ‘Introducing Pushpa Raj' అనే వీడియోను విడుదల చేశారు. పూర్తి మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఫలితంగా ఇది ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది. తద్వారా తెలుగులోనే ఎక్కువ వ్యూస్ సాధించిన టీజర్‌గా నిలిచింది. ఈ మధ్యనే 70 మిలియన్ మైలురాయి దాటేసింది.

  ‘పుష్ప' నుంచి పండుగలాంటి వార్త

  ‘పుష్ప' నుంచి పండుగలాంటి వార్త

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ‘పుష్ప' మూవీ గురించి తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. మొదటి భాగానికి సంబంధించిన ఆల్బమ్‌ను ఇప్పటికే రెడీ చేసేశాడట మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్. ఇటీవలే రీ రికార్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందని తెలిసింది. ఇందులో కొన్ని పాటల చిత్రీకరణ కూడా పూర్తైందని కూడా తాజాగా తెలిసింది.

  ఎన్టీఆర్ షోలో చరణ్ ఆట అదుర్స్: ‘ఎవరు మీలో కోటీశ్వరులు' ఎపిసోడ్ లీక్.. మెగా హీరో ఎంత గెలిచాడంటే!

  Ram Charan Biography: Ram Charan is one of the highest paid actors of Tollywood
  అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు పూనకాలే

  అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు పూనకాలే

  తాజా సమాచారం ప్రకారం.. ‘పుష్ప' మూవీలో దేవీ శ్రీ ప్రసాద్ అన్నీ ఫాస్ట్ బీట్ సాంగ్సే కంపోజ్ చేశాడట. మొదటి పార్ట్ మొత్తం మాస్ యాక్షన్‌తో ఉంటుంది కాబట్టి.. దానికి అనుగుణంగానే మసాలా సాంగ్స్‌ను రెడీ చేశాడట. ఈ పాటలన్నింటికీ అదిరిపోయే డ్యాన్స్ నెంబర్లు ఉంటాయని తెలుస్తోంది. బన్నీ కెరీర్‌లోనే తొలిసారి ఈ ఆల్బమ్‌ మొత్తాన్ని అదిరిపోయేలా ప్లాన్ చేశారనే టాక్ వినిపిస్తోంది.

  English summary
  Tollywood Star Hero Allu Arjun Doing Pushpa Under Creative Director Sukumar Direction. Music Director Devi Sri Prasad Records solid numbers for This Movie. స
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X