దేవీశ్రీ ప్రసాద్ కు అలాంటి అలవాటు.. అందుకే సినిమాలకు నో చెబుతున్నారంట..!

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సౌత్ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా వెలువందుతున్నారు. 25 ఏళ్లుగా దేవి శ్రీ ప్రసాద్ చిత్ర పరిశ్రమలో తన సంగీతాన్ని వినిపిస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు దేవిశ్రీప్రసాద్ 100కు పైగా సినిమాలకు సంగీత దర్శకుడుగా పని చేశారు. ఎన్నో బ్లాక్ బ్లాస్టర్ హిట్స్ ను అందించారు. క్లాస్ అయినా మాస్ అయినా, లవ్ అయినా రొమాంటిక్ అయినా, యాక్షన్ అయినా తన స్టైల్ లో సౌండ్ ట్రాక్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అందిస్తూ దుమ్ము లేపారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీలోనూ తన మ్యూజిక్ సత్తాను చాటారు.

కెరియర్లో దేవీశ్రీ ప్రసాద్ ఎన్నో గుర్తుండిపోయే సూపర్ హిట్ సాంగ్స్ ను తెలుగు ప్రేక్షకులకు, సినీ ప్రియులకు అందించారు. తన సంగీత మాధుర్యంతో మ్యూజిక్ లవర్స్ ను ఫిదా చేశారు. దేవి చిత్రంతో మొదలైన ఆయన మ్యూజిక్ కెరియర్ ఇప్పటికీ నిరాటకంగా కొనసాగుతూనే వస్తుంది. ఆ మధ్య కాస్త డౌన్ అయిన మళ్లీ బిగ్ ప్రాజెక్ట్స్ కు సంగీతం అందిస్తూ అదరగొడుతున్నారు. రీసెంట్గా దేవిశ్రీప్రసాద్ రేర్ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నారు. కేవలం 100 రోజుల్లోనే బ్యాక్ టు బ్యాక్ మూడు పెద్ద సినిమాలకు సంగీతం అందించి సక్సెస్ అందుకున్నారు.

Devi Sri Prasad set a Particular rule in his Music Career That is why he won t do that type of Movies

తమిళ్ స్టార్ సూర్య నటించిన కంగువా, ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప 2 : ది రూల్, అక్కినేని నాగచైతన్య రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తండేల్ చిత్రంతో ఆరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నారు. కేవలం 100 రోజుల్లోనే దేవిశ్రీప్రసాద్ వరుసగా మూడు చిత్రాలకు చాట్ బస్టర్ సాంగ్స్ ను అందించి ట్రెండింగ్ లో నిలిచారు. నెక్స్ట్ మరో రెండు భారీ చిత్రాలకు క్రేజీ ట్యూన్స్ ను కంపోజ్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో దేవి శ్రీ ప్రసాద్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

దేవిశ్రీ ప్రసాద్ తన కెరియర్లో ఎందరో స్టార్ హీరోలతో, గొప్ప డైరెక్టర్ లతో కలిసి పని చేశారు. విభిన్న కథలకు అనుగుణమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్స్, అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చి సౌత్ లో తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేశారు. అయితే దేవిశ్రీప్రసాద్ కు వింత అలవాటు ఉందని తెలిసింది. అందుకే కొన్ని సినిమాలకు నిర్మొహమాటంగా దేవి శ్రీ ప్రసాద్ నో చెబుతుంటారు అంట. ఆ వరుసలోనే డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గద్దలకొండ గణేష్ చిత్రాన్ని దేవిశ్రీప్రసాద్ వదులుకున్నారంట. ఇంతకీ ఆయనకు ఉన్న అలవాటు ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అయితే దేవిశ్రీప్రసాద్ తన కెరియర్లో రీమేక్ సాంగ్స్ చేయకూడదని గట్టి నియమం పెట్టుకున్నారంట. ఆ రూల్ ను 25 ఏళ్ల కెరియర్లో ఎప్పుడు బ్రేక్ చేయలేదంట. అందుకే రీమేక్ సాంగ్స్ ఉన్న సినిమాలను ఆయన తిరస్కరిస్తూ వచ్చారంట. ఈ క్రమంలోనే మెగా ప్రిన్స్ వరుణ్ సందేశ్ నటించిన గద్దలకొండ గణేష్ చిత్రాన్ని కూడా దేవిశ్రీప్రసాద్ వదులుకున్నారంట. తొలుత ఆ సినిమాకు సంగీతాన్ని అందించే అవకాశం దేవిశ్రీ ప్రసాద్ కే వచ్చిందని కూడా తెలిపారు.

ఇక రీమేక్ సాంగ్ ఉండడం వల్ల చేయనని హరీష్ శంకర్ కు తెలియజేశారు అంట. వీరి కాంబోలో ' గబ్బర్ సింగ్' మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ మూవీ సాంగ్స్ ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో కూడా విధితమే. నెక్స్ట్ హరి శంకర్ డైరెక్షన్లో రాబోతున్న పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రానికి కూడా దేవినే సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X