twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దేవి శ్రీ షాకింగ్ డిసీజన్.. ఆయన అభిమానులకు నిరాశే!

    |

    సంగీతం అంటే దేవి శ్రీ ప్రసాదే తప్ప ఇంకెవ్వరూ లేరు అన్నట్లుగా ఉంది ప్రస్తుతం టాలీవుడ్‌లో పరిస్థితి. చిన్న సినిమానా, పెద్ద సినిమానా అని ఏ మాత్రం ఆలోచించకుండా వరుస పెట్టి సినిమాలు తన వశం చేసుకున్నారు దేవి శ్రీ. అయితే ఆయన మ్యూజిక్ అందించిన సినిమాలు దాదాపు సక్సెస్ బాటే పట్టాయి తప్ప డిసాస్టర్‌గా మిగిలిన సందర్భాలు లేవు. ఈ నేపథ్యంలో ఓ సంగీత దర్శకుడిగా దేవీ శ్రీ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అయితే తాజాగా ఆయన గురించి వినిపిస్తున్న ఓ వార్త సంగీత ప్రియులకు నిరాశే మిగుల్చుతోంది.

    చాలా ఏళ్లుగా ఎన్నో మంచి మంచి పాటలు అందించిన దేవీ శ్రీ ప్రసాద్ పై ఈ మధ్యకాలంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన మ్యూజిక్ లో మ్యాజిక్ మిస్ అయిందని, దేవీ ట్యూన్స్ అన్నీ ఒకేలా ఉంటున్నాయని పెద్ద ఎత్తున చెప్పుకుంటున్నారు ప్రేక్షకులు. ఇటీవలే రామ్ చరణ్ హీరోగా వచ్చిన వినయ విధేయ రామ.. ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా వచ్చిన మహర్షి సినిమాలో మ్యూజిక్ పరంగా దేవీ మార్క్ ఏ మాత్రం కనిపించలేదని టాక్ వచ్చింది.

     Devi Sri Prasad Shocking Desicion

    దీంతో దేవీ శ్రీ పై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ ఊపందుకున్నాయి. ఇది గమనించిన దేవీ పరిస్థితి చేయి దాటకూడదనే ఉద్దేశ్యంతో ఓ నిర్ణయానికి వచ్చారట. వరుస సినిమాలు ఒప్పుకోవద్దని, అలా వరుస సినిమాలు చేయడం కారణంగానే ఇలాంటి విమర్శలు వస్తున్నాయని భావించిన ఆయన ఇక చిన్న సినిమాల జోలికి వెళ్లకూడని డిసైడ్ అయ్యారట. ఈ మేరకే ఆయన ఇప్పటికే ఒప్పుకున్న సినిమాల నుంచి కూడా తప్పుకుంటున్నారని తెలుస్తోంది. కేవలం సెలెక్టివ్ సినిమాలకే మ్యూజిక్ అందించి సంగీతం పరంగా తన మార్క్‌ని చూపించాలని దేవీ ఓ డిసీజన్ కి వచ్చారట. ఇది ఆయన అభిమానులకు నిరాశ పరిచే వార్త అనడం కంటే శుభవార్తే అనడం మేలేమో! ఎందుకంటే వెనువెంట చేస్తేనే సూప్ హిట్స్ సాధించే దేవీ.. ఇక ఆచితూచి, సమయం తీసుకొని మ్యూజిక్ అందిస్తే ఆ జోరు, హోరు వర్ణించగలమా చెప్పండి.

    English summary
    Music Director Devi Sri Prasad decided to not going to give music for small movies
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X