పుష్ప 3 ఐటెమ్ సాంగ్ కు ఆ హీరోయిన్ పర్ఫెక్ట్.. దేవిశ్రీ కామెంట్ వైరల్!
Pushpa 3: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సక్సెస్ పుల్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన మూవీ 'పుష్ప2:ది రూల్'. గతేడాది డిసెంబర్ 5 న విడుదలైన ఈ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది. ఎవరూ ఊహించలేనంతగా ఇప్పటి వరకు రూ. 1850 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాహుబలి 2 రికార్డులు కూడా బ్రేక్ చేసింది. ఈ నేపథ్యంలో పుష్ప 2 కు సీక్వెల్ గా పుష్ప 3 రాబోతుందనీ, ఈ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చేసింది. పుష్ప 3 ఐటెమ్ సాంగ్ కు ఆ హీరోయిన్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది. ఆ కథేంటో ఓ లూక్కేయండి.
భారీ విజయాన్ని అందుకున్న పుష్ప 2 కు సీక్వెల్ గా పుష్ప 3మూవీని కూడా చేయబోతున్నారు. ఇప్పటికే పుష్ప 3 కూడా రాబోతుందని అధికారికంగా ప్రకటించారు కూడా. పుష్ప 3 ది రాంపేజ్ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.అయితే పుష్ప 3 ఎలా ఉండబోతుందో అనే అంచనాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ..పుష్ప 3 పై మరింత హైప్ పెచ్చేలా.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఇంతకీ ఆ ఇంట్రెస్టింగ్ అదేంటంటే.. పుష్ప 3లో ఐటెమ్ సాంగ్‌లో ఏ అమ్మడు మాస్ స్టెప్పులేయబోతున్నారని మ్యూజిక్ డైరెకర్ట్ దేవిశ్రీ ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానమిచ్చారు. కామన్ గా ఐటెం సాంగ్ అంటేనే హాట్ బ్యూటీస్ గ్లామర్ షో. నాటుకోడి కూరలా ఘాటుగా ఉండే గ్లామర్ సాంగ్స్ కోసం మాస్ ఆడియన్స్ తహతహలాడుతారు. అందులోనూ సుక్కు బన్నీ కాంబో లో ఐటెం సాంగ్ అంటే.. పూనకాలే.. థియేటర్లలో రచ్చ రంబోలనే. ఇక పుష్ప సిరీస్ చిత్రాల్లో ఐటెమ్ సాంగ్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.
పుష్ప 1 లో సమంత 'ఊ అంటావా మామ.. ఉఊ అంటావా మామా' అంటూ తన గ్లామర్‌తో దుమ్మురేపింది. ఇక పుష్ప - 2లో శ్రీలీల కిస్సిక్ అనే సాంగ్ మాస్ సెప్పులేసి.. యూత్ ఉరూతలూగించింది. ఈ ఐటెం సాంగ్‌లో శ్రీలీలకు నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అయితే, స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీలను తానే సూచించినట్లు చెప్పుకొచ్చాడు. పుష్ప 2 కిస్సిక్ పాటలో ఎవరు నటించినా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటారని తాము ముందే ఊహించామని అయన అన్నారు. అయితే, ఈ సాంగ్‌కు శ్రీలీల మంచి ఆప్షన్ అని తాను మేకర్స్‌కు ముందే చెప్పానని ఆయన అన్నారు.

ఇక పుష్ప 3 ఐటెం సాంగ్ కు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీకపూర్ పర్‌ఫెక్ట్ ఛాయిస్ అని దేవీ శ్రీ వెల్లడించాడు.తాను కంపోజ్ చేసే ఐటమ్ సాంగ్స్ సక్సెస్ అవుతాయని తనకు ముందే తెలుసున్నారు. తన ఐటెం సాంగ్ ల్లో టాప్ హీరోయిన్స్ సెప్పులేయడం గర్వంగా ఉందని తెలిపాడు. జిగేలు రాణి సాంగ్ లో పూజా హెగ్డే, ఊ అంటావాలో సమంత, కిస్సిక్‌లో యంగ్ బ్యూటీ శ్రీలీల, పక్కా లోకల్ సాంగ్ లో కాజల్ అగర్వాల్ సెప్పులేశారనీ, వీరంతా ప్రస్తుతం టాప్ పోజిషన్ లో ఉన్నారని తెలిపారు. అయితే.. ఇక పుష్ప 3 ఐటెమ్ సాంగ్లో ఎవరు కనిపిస్తారనే ఊహాగానాల నేపథ్యంలో దేవీ శ్రీ కొంత మంది హీరోయిన్స్ పేర్లు ప్రస్తావించారు.
తనకు అసాధారణమైన డ్యాన్సర్‌లతో వర్క్ చేయడం చాలా ఇష్టమని, అలా తాను హీరోయిన్ సాయి పల్లవి డ్యాన్స్ కు తాను పెద్ద అభిమానినని పేర్కొన్నారు. ఇక బాలీవుడ్ లో జాన్వీ కపూర్ అద్భుతమైన డ్యాన్సర్ అని, ఆమె స్టెప్పులేసిన పాటలు కొన్నింటిని తాను చూశానని, ఆమెలో శ్రీదేవి స్వగ్ ఉందన్నాడు. అంతిమంగా పుష్ప3లో ఐటమ్ సాంగ్ కు జాన్వీ పర్పెక్ట్ ఛాయిస్ అని అభిప్రాయపడ్డాడు. అల్లు అర్జున్, జాన్వీ కపూర్ సెప్పులేస్తే థియేటర్లు దద్దరిల్లుతాయనడంతో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ మరీ ఫైనల్ గా ఎవరూ సెలక్ట్ అవుతారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











