ఇప్ప‌టివ‌ర‌కు అవ‌కాశం రాలేదు. కానీ, ఇప్పుడు చెబుతున్నా.. మహేష్ బాబుపై దేవి శ్రీ వ్యాఖ్యలు

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్‌లది ఓ ప్రత్యేకమైన అనుబంధం. ఈ ఇద్దరి కాంబినేష‌న్‌లో ఇప్ప‌టికే నాలుగు సినిమాలు వ‌చ్చాయి. మ‌హేష్ బాబు హీరోగా వచ్చిన ''నేనొక్క‌డినే, శ్రీమంతుడు, భ‌ర‌త్ అనే నేను, మ‌హ‌ర్షి'' సినిమాల‌కు దేవి శ్రీ బాణీలు కట్టారు. అలాగే ప్ర‌స్తుతం మహేష్ బాబు కెరీర్‌లో రాబోతున్న 'స‌రిలేరు నీకెవ్వ‌రు' సినిమాకు కూడా దేవిశ్రీయే సంగీత ద‌ర్శ‌కుడు కావడం ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. మహేష్ తో కలిసి ఐదో సినిమా చేస్తున్న సందర్బంగా దేవీ శ్రీ కొన్ని విషయాలు మీడియాతో పంచుకున్నారు. ఆ వివరాలు చూస్తే..

 సరిలేరు నీకెవ్వరు మూవీ

సరిలేరు నీకెవ్వరు మూవీ

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో 26వ సినిమాగా రాబోతోంది సరిలేరు నీకెవ్వరు మూవీ. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను దిల్ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేష్ బాబు కలిసి సంయుక్తంగా నిర్మిస్తుండటం విశేషం. మహేష్ కోసం మరోసారి దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు కడుతున్నారు.

ఘనంగా ముహూర్తపు వేడుక

ఘనంగా ముహూర్తపు వేడుక

మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబందించిన పూజా కార్యక్రమాలు శుక్రవారం నాడు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ముఖ్య అతిధిగా హాజరు కాగా.. మహేష్ బాబు మినహా చిత్రయూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు.

ఖచ్చితంగా చేసి తీరుతా..

ఖచ్చితంగా చేసి తీరుతా..

ఈ సందర్బంగా దేవి శ్రీ మాట్లాడుతూ.. మ‌రోసారి మ‌హేష్ బాబుతో ప‌నిచేసే అవ‌కాశం రావడం హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మ‌హేష్ బాబు సినిమాల్లో ఊర మాస్ పాట‌లు ఉండాల‌ని ఆయ‌న అభిమానులు సోష‌ల్ మీడియాలో మెసేజ్‌లు పెడుతుంటారు. ఇప్ప‌టివ‌ర‌కు అలాంటి అవ‌కాశం రాలేదు కానీ, ఇప్పుడు చెబుతున్నా.. `సరిలేరు నీకెవ్వ‌రు` సినిమాలో ఖచ్చితంగా ఓ ఊర మాస్ పాట చేసి తీరుతా. అభిమానుల‌కు ఇదే నా హామీ'' అన్నారు.

లేడీ అమితాబ్ విజయశాంతి ఎంట్రీ

లేడీ అమితాబ్ విజయశాంతి ఎంట్రీ

దాదాపు పదిహేనేళ్ళు వెండితెరకు దూరంగా ఉంటూ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన లేడీ అమితాబ్ విజయశాంతి ఈ సినిమాతోనే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. మహర్షి లాంటి బిగ్ సక్సెస్ తర్వాత మహేష్ బాబు సినిమా పైగా విజయశాంతి రీ ఎంట్రీ అనడంతో సరిలేరు నీకెవ్వరు మూవీపై ప్రేక్షక లోకంలో ఇప్పటినుంచే ఆసక్తి మొదలైంది.

సెకండ్ ఇన్నింగ్స్ పై విజయశాంతి స్పందన

సరిలేరు నీకెవ్వరు మూవీతో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తుండటంపై తాజాగా విజయశాంతి స్పందించింది. చాలా గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు రావడమంటే అది దేవుడి సంకల్పమైనా అయి ఉండాలి లేదా ప్రజా బలమైనా అయి ఉండాలి అంటోంది విజయశాంతి. తనకు ఇప్పటికీ వృత్తి పట్ల గౌరవం ఉందని, ఈ అవకాశాన్ని ఓ బాధ్యతగా స్వీకరిస్తున్నానని విజయశాంతి పేర్కొనడం ఆసక్తికర అంశం.

ఆర్మీ ఆఫీసర్‌తో రష్మిక రొమాన్స్

సరిలేరు నీకెవ్వరు మరో అట్రాక్షన్ మహేష్ బాబుతో యంగ్ హీరోయిన్ రష్మిక మందన్న రొమాన్స్ చేస్తుండటం. ఇప్పటికే విజయ్ దేవరకొండతో రక్తి కట్టించే లిప్ లాక్స్ చేసిన ఈ భామ ఇక మహేష్ తో ఎలాంటి రొమాన్స్ చేయనుందో! అనే కుతూహలం నెలకొంది ప్రేక్షకుల్లో. ఈ చిత్రంలో మహేష్.. ఆర్మీ ఆఫీసర్‌‌గా పవర్ ఫుల్ పోషించనున్నారని డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X