ఆ మ్యూజిక్ డైరెక్టర్‌తో మహేష్ విభేదాలా? అందుకే ఇలా చేశాడా? సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆగ్రహం!
ప్రస్తుతం సినిమాలకి మ్యూజిక్ వర్క్ అనేది ఎంత కీలకంగా మారిపోయింది అనేది అందరికీ తెలుసు. అలాగే ఒక స్టార్ సంగీత దర్శకుడు ఓకే చేస్తే ఆ సినిమా తన వల్లే మేజర్ గా నిలబడుతుంది అనేది కూడా ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్స్ లో ఒకటిగా నిలిచింది. కాగా దాదాపు ఇండియన్ సినిమా దగ్గర సినిమాల్లో మ్యూజిక్ వర్క్ అనేది చాలా కీలకమైన ఎలిమెంట్ గా నిలిచిపోయింది.
ఇక మన సౌత్ ఇండియా సినిమా దగ్గర కూడా చాలా సినిమాలకు అందులోని పాటలు బాక్గ్రౌండ్ స్కోర్ లు మనకి తెలియకుండానే ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. అలా తన సంగీతంతో ప్రస్తుతం టాలీవుడ్ లో అలరిస్తున్న స్టార్ సంగీత దర్శకుల్లో దేవిశ్రీ ప్రసాద్ కూడా ఒకరు. కాగా దేవీ గత రెండు దశాబ్దాలకి పైగా తన మ్యూజిక్ తో మ్యూజిక్ లవర్స్ ని అలరించాడు.

ఇన్నేళ్ళలో ఎన్నో సినిమాలు ఎందరో స్టార్ హీరోస్ తో కలిసి తాను వర్క్ చేసాడు. అయితే దేవిశ్రీ ప్రసాద్ హవా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రీసెంట్ గా కూడా దేవిశ్రీ ప్రసాద్ పాన్ ఇండియా చార్ట్ బస్టర్ లు అందించారు. కాగా సంగీత దర్శకులు ఆఫ్ లైన్‌లో మ్యూజిక్ కాన్సెర్ట్ లు పెట్టుకుంటూ ఉంటారు. అలా రీసెంట్ గా హైదరాబాద్ లో దేవిశ్రీ ప్రసాద్ తన గ్రాండ్ కచేరి సెట్ చేసుకున్నాడు.
హైదరాబాద్‌లో జరిగిన మ్యూజిక్ కాన్సెర్ట్‌కు బ్రహ్మండమైన రెస్పాన్స్ వచ్చింది. మ్యూజిక్ లవర్స్, డీఎస్పీ అభిమానులు ఈ సంగీత విభావరికి పోటెత్తారు. చిత్ర, మంగ్లీ, సాగర్, హీరోయిన్ శ్రద్దా దాస్ లాంటి వాళ్లు తమ పాటలతో ప్రేక్షకులను ఆనందంలో ముంచెత్తారు. గచ్చిబౌలి స్టేడియం నాలుగు గంటలపాటు హోరెత్తింది. అయితే ఈ షోలో మహేష్ బాబు అభిమానులు నిరాశకు గురయ్యారు.
జెనరల్ గా ఏ సంగీత దర్శకుడు అయినా తన కెరీర్ లో వర్క్ చేసిన స్టార్ హీరోస్ తాలూకా చార్ట్ బస్టర్ సాంగ్స్ కంపల్సరీ. అయితే నిన్న ఈవెంట్ లో అలానే చాలా మంది స్టార్ హీరోస్ సాంగ్స్ తో దేవిశ్రీ ఊపేసాడు కానీ ఒక్క హీరోకి సంబంధించి ఒక్కటంటే ఒక పాట కూడా పాడలేదట.. దీనితో ఆ హీరో ఫ్యాన్స్ ఇప్పుడు చాలా ఫైర్ అవుతున్నారు. మరి ఆ హీరో ఎవరో కూడా కాదు టాలీవుడ్ లో పెద్ద స్టార్ హీరోస్ లో ఒకరైన సూపర్ స్టార్ మహేష్ బాబే..

కాగా మహేష్ ఫ్యాన్స్ మేము కూడా మా హీరో పాటలు లైవ్ పెర్ఫామ్ చూసి ఎంజాయ్ చేద్దామనే ఖర్చు చేసి వచ్చామని కానీ దేవిశ్రీ ప్రసాద్ బాగా డిజప్పాయింట్ చేసాడు అని సోషల్ మీడియాలో తనపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. అందరి హీరోస్ మీదా పాటలు పాడి ఒక్క మహేష్ బాబు సినిమా పాటలు ఒక్కటి కూడా పెర్ఫామ్ చెయ్యకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పోనీ మహేష్ బాబుతో చేసింది ఒక్క సినిమానేనా అంటే చాలానే ఉన్నాయి. అందులో ఎన్నో సెన్సేషనల్ హిట్ సాంగ్స్ కూడా ఉన్నాయి.
అయినప్పటికీ ఒక్క సాంగ్ ని కూడా దేవిశ్రీ ప్రసాద్ పడకపోవడం మాత్రం చాలా ప్రశ్నలకి దారి తీస్తుంది. కాగా దీనితో దేవిశ్రీకి మహేష్ బాబుకి ఏమన్నా గొడవలు ఉన్నాయా? అనేది కూడా టాక్ వినిపిస్తుంది. ఎంత కాదు అనుకున్నా మహేష్ బాబుది ఒక్క సాంగ్ కూడా పాడకపోవడం అనేది మర్చిపోయే అంశం కూడా కాదు. మరి ఇది దేవిశ్రీ ప్రసాద్ వాంటెడ్ గా చేసాడో లేక నిజంగా మర్చిపోయాడో ఏమో కానీ ఇపుడు మహేష్ అభిమానుల తీవ్ర నిరాశకు లోనయ్యారు.


Click it and Unblock the Notifications











