twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కోట్లకు పడగలెత్తిన రౌడీబేబీ.. యూట్యూబ్‌లో ధనుష్, సాయిపల్లవి జోష్

    |

    ఇటీవల కాలంలో సినిమా పాటలకు విశేషంగా యూట్యూబ్‌లో ఆదరణ లభిస్తున్నది. లక్షల నుంచి కోట్ల మేర వ్యూస్ లభించడం నిర్మాతలు, సినిమా యూనిట్స్ సంతోషంలో మునిగిపోతున్నాయి ఈ మధ్య మారి2, అల వైకుంఠపురంలో లాంటి చిత్రాల పాటలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నాయి.

    గత ఏడాది కాలంగా మారి 2 చిత్రంలోని రౌడీ బేబి పాట యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్నది. లక్షల నుంచి కోట్ల సంఖ్యలో వ్యూస్ సాధిస్తూ దూసుకెళ్తున్నది. దక్షిణాదిలో సినీ పరిశ్రమలో అత్యధిక వ్యూస్ అంటే ఒక బిలియన్ వ్యూస్ సాధించిన పాటగా ఓ ఘనతను సొంతం చేసుకొన్నది.

    Dhanush and Sai Pallavis Rowdy Baby Song in Billion views club

    ఈ సందర్భంగా హీరో ధనుష్ ట్వీట్ చేశారు. నా సినిమా కెరీర్‌లో యాదృచ్ఛికంగా మధురమైన సంఘటన చోటుచేసుకొన్నది. కోలవెరి డీ రిలీజై 9 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న రోజునే రౌడీ బేబీ పాట 1 బిలియన్ వ్యూస్ సాధించింది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఒక బిలియన్ వ్యూస్ సాధించిన పాటగా రౌడీ బేబి నిలువడం మాకు గర్వంగా ఉంది. ఈ పాటను ఆదరించిన ప్రతీ ఒక్కరికి మా చిత్ర యూనిట్ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నది అంటూ ధనుష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

    రౌడీ బేబీ పాటకు యువన్ శంకర్ రాజా సంగీతం దర్శకత్వం వహించారు. బాలాజీ మోహన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని పాటను ధనుష్, డీ పాడారు. తమిళంలో ఈ పాటకు పోయెట్ ధనుష్ సాహిత్యం అందించారు. తెలుగులో ఈ పాటను ధనుష్, ఎంఎం మానసి పాడగా, సామ్రాట్ సాహిత్యాన్ని అందించారు.

    English summary
    Unleashing the Video Song of Rowdy Baby from Maari 2. Maari 2 stars Dhanush, Sai Pallavi, Krishna, Varalakshmi Sarathkumar & Tovino Thomas in lead roles; Music Composed by Yuvan Shankar Raja & Directed by Balaji Mohan. This song registered one billion views in youtube. This occasison, Dhanush tweets that What a sweet coincidence this is ❤️❤️ Rowdy baby hits 1 billion views on same day of the 9th anniversary of Kolaveri di. We are honoured that this is the first South Indian song to reach 1 billion views. Our whole team thanks you from the heart
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X