దుమ్మురేపుతున్న రౌడీ బేబీ.. ధనుష్, సాయిపల్లవి పాట సంచలనం
తమిళ స్టార్ హీరో ధనుష్, అందాల తార సాయి పల్లవి నటించిన మారి2 చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయినా ఆ సినిమాలో పాటలు మాత్రం సోషల్ మీడియా, యూట్యూబ్ మీడియాలో వైరల్ అయ్యాయి. మారి 2 సినిమాలోని పాటలు సినీ అభిమానులను పిచ్చెక్కించాయి. యువన్ శంకర్ సంగీత దర్శకత్వంలో ధనుష్, డీ పాడిన రౌడీ బేబీ పాట అన్ని వర్గాల సంగీత ప్రియులను విశేషంగా ఆకర్షించింది. ఆ పాటకు ప్రభుదేవా నృత్యం సమకూర్చడం గమనార్హం.
రౌడీ బేబీ పాట కేవలం తమిళంలోనే కాకుండా దేశవ్యాప్తంగా వైరల్ అయింది. అన్ని భాషల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నది. ఒక్క యూట్యూబ్‌లోనే ఈ పాట 600 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకొని రికార్డు సృష్టించింది. ఈ రేంజ్‌లో వ్యూస్‌ను సొంతం చేసుకోవడం దక్షిణ భారతంలో ఇదే మొదటిసారి.

2016లో విడుదలైన మారి సినిమాకు సీక్వెల్‌గా మారి 2 వచ్చింది. ఈ చిత్రానికి బాలాజీ మోహన్ దర్శకత్వం వహించారు. 2018లో డిసెంబర్ 21న రిలీజైన ఈ చిత్రం సినీ విమర్శకుల ప్రశంసలు అందుకొన్నది. ఇక ఈ పాట టిక్ టాక్ సోషల్ మీడియా యాప్‌లో స్వైర విహారం చేస్తున్నది. ఈ పాటకు ఆర్య, సాయేషా కూడా తమ పెళ్లిలో డ్యాన్స్ చేయడం మరింత వైరల్‌గా మారింది.
ఇంత క్రేజీ పాట ఉన్న మారి2 సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కానీ సాయిపల్లవి డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. గత కొద్దినెలలుగా యూట్యూబ్‌లో టాప్ స్థానంలో కొనసాగడం సాయిపల్లవి మహిమే అంటున్నారు. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
ఇక ధనుష్ కెరీర్ విషయానికి వస్తే, వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందే అసురన్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ధనుస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అనంతరం కార్తీక్ సుబ్బరాజ్‌తో తీసే సినిమాలో ధనుష్ నటిస్తారు.


Click it and Unblock the Notifications











