Miss Shetty Mr Polishetty నవీన్ పోలిశెట్టికి ధనుష్ షాక్.. అనుష్క శెట్టి కోసం హతవిధీ అంటూ!
సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి, యువ హీరో నవీన్ పోలిశెట్టి నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకొన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వంశీ, ప్రమోద్ నిర్మాణ సారథ్యంలో నూతన దర్శకుడు మహేష్ బాబు పీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకొన్నది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు ఊపందుకొన్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం ధనుష్ పాడిన పాట ప్రమోను రిలీజ్ చేయగా మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ పాటకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ కోసం సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రీ రాసిన పాటను ధనుష్ ఆలపించారు. ఈ పాటకు ముందు నవీన్ పోలిశెట్టి పడేందుకు చేసిన ప్రయత్నాన్ని వీడియోగా షూట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. ఈ పాటను పాడేందుకు నవీన్ పోలిశెట్టి పడిన తంటాలు వినోదాన్ని పండించింది. చివరకు ధనుష్ హతవిధి అంటూ పాడిన పాట ప్రోమోను వదిలి.. నవీన్‌కు ప్రయత్నాలకు బ్రేక్ వేశారు.

హతవిధీ ఏందిదీ.. ఊహలో లేనిదీ.. బుల్లి చీమ బతుకుపై బుల్డోజరైనదీ.." అంటూ సాగే ఈ పాటను ధనుష్ తనదైన శైలిలో ఆలపించారు. పూర్తి పాటను మే 31న రిలీజ్ చేయబోతున్నారు. అదే రోజు ధనుష్ పాడిన పాట లిరికల్ వీడియోను సంగీత ప్రియులకు అందించనున్నారు.
ఇక మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి చిత్రంలో నవీన్ పొలిశెట్టి స్టాండప్ కమెడియన్‌గా, అనుష్క శెట్టి చెఫ్‌గా చూపించారు.యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ బాబు పీ డైరెక్ట్ చేసిన చిత్రం ఇది. ఇక తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మళయాల భాషల్లో విడుదల కాబోతోన్నది.
నటీనటులు: అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి, జయసుధ, మురళీ శర్మ, తులసి తదితరులు
నిర్మాతలు: వంశీ, ప్రమోద్
రచన, దర్శకత్వం: మహేష్ బాబు పీ
బ్యానర్: యూవీ క్రియేషన్స్
ప్రొడక్షన్ డిజైనర్: రాజవీన్
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్: రాఘవ్ తమ్మారెడ్డి
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరావు
సంగీతం: రధన్
సినిమాటోగ్రఫీ : నీరవ్ షా
పిఆర్వో: జీఎస్కే మీడియా


Click it and Unblock the Notifications











