నవీన్ పొలిశెట్టి, అనుష్క కోసం రంగంలోకి స్టార్ హీరో.. స్పెషల్ పాటతో సర్ ప్రైజ్!
అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో రాబోతున్న తాజా చిత్రం మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి. ఇందులో ఆమెకు జోడీగా యంగ్ అండ్ డైనమిక్ హీరో నవీన్ పోలిశెట్టి కనిపించబోతున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మహేశ్ బాబు పచ్చిగొల్ల దర్శకుడు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ లేటెస్ట్ అప్ డేట్ వెలుగులోకి వచ్చింది.
అదేంటంటే.. స్టార్ హీరో ధనుష్ ఈ సినిమాలో ఓ పాటను పాడతున్నారట. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతుంది. మరోవైపు ధనుష్ అభిమానులు కూడా చాలా ఎగ్జైట్ అవుతున్నారు. ఎలాంటి పాట పాడుతున్నారు, ఎలా పాడబోతున్నారని కామెంట్లు చేస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో జయసుధ, మురళీ శర్మ, నాజర్ ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారు.

ఈ సినిమాకు రధన్ సంగీతం అందిస్తుండగా... నీరవ్ షా సినిమాటోగ్రఫీ, రాజు సుందరం కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన శాటిలైట్, డిజిటల్ హక్కులను జీ ఛానెల్స్ దక్కించుకున్నాయి. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి డిజిటల్ హక్కులను జీ గ్రూప్ కొనుగోలు చేసింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళంలో రిలీజ్ కాబోతుంది.
ఈ చిత్రంలో అనుష్క శెట్టి మాస్టర్ చెఫ్ గా కనిపిస్తుండగా.. నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ గా కనిపించబోతున్నాడు. గతంలో ఈ చిత్ర బృందం ఓ వెరైటీ వీడియోను విడుదల చేసింది. అందులో నవీన్.. అనుష్క పోస్టర్ లో మాట్లాడుతూ కనిపిస్తాడు. మన సినిమాకు ఏం టైటిల్ పెడదాం, చాలా టైటిల్స్ సజెస్ట్ చేస్తున్నారని అడుగుతాడు. ఏదైతే బాగుటుందో చెప్పమని అనుష్కను ప్రశ్నిస్తాడు.

దేవసేనా.. నీ మనసులో ఉన్నది నేనేనా, స్వీటీతో ఎవడీ క్యూటీ అంటూ నవీన్ చెప్పే టైటిల్స్ పేర్లు నవ్వు తెప్పించాయి. ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా పరిచయమైన ఈయనకు కామెడీ టైమింగ్ బాగుంటుందని అంతా అనకుంటున్నారు. జాతి రత్నాలు చిత్రంతో ఆయనకు మరింత క్రేజ్ రాగా.. తాజాగా అనుష్కకు జోడీగా కనిపించనున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











