Die Hard Fan ఆకట్టుకొంటున్న అరెరే కుదురే లేదే పాట.. డిఫరెంట్ లవ్ స్టోరీగా డై హార్డ్ ఫ్యాన్
నూతన నటీనటులు, చిన్న బడ్జెట్‌తో విభిన్నమైన కథ, విలక్షణ పాత్రలతో వస్తున్న సినిమాలకు టాలీవుడ్‌లో ప్రేక్షకుల పెద్ద పీట వేస్తున్నారు. గతంలో డిఫరెంట్ సబ్జెక్ట్‌తో వచ్చిన చిత్రాలను తెలుగు ప్రేక్షకులు అక్కున చేర్చుకొన్నారు. అలాంటి కథ, కథనాలతో వస్తున్న చిత్రం డై హార్డ్ ఫ్యాన్. శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై యంగ్ డైరెక్టర్ అభిరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శివ ఆలపాటి, ప్రియాంక శర్మ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీహన్ సినీ క్రియేషన్స్ బ్యానర్‌లో చంద్రప్రియ సుబుద్ధి నిర్మిస్తున్నారు.
డై హార్డ్ ఫ్యాన్ సినిమా కథ విషయానికి వస్తే.. స్టార్ హీరోలకే కాకుండా హీరోయిన్స్‌కు కూడా ఫ్యాన్స్ ఉంటారనేది వాస్తవం. సినిమాలో నటించే హీరోయిన్స్ అంటే యూత్‌లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఓ అభిమాని తను అభిమానించే హీరొయిన్‌ను కలవాలనుకుంటాడు. అనుకోని పరిస్థితుల్లో హీరోయిన్ కలిస్తే ఆ రాత్రి ఏం జరిగిందనేది ఈ చిత్ర ముఖ్య కథాంశం.
డై హార్డ్ ఫ్యాన్ చిత్రానికి మధు పొన్నాస్ మ్యూజిక్ అందిస్తున్నార. తాజాగా ఈ చిత్రంలోని 'అరెరే కుదురే లేదే' అనే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటను హరిచరణ్ ఆలపించగా, లక్ష్మి ప్రియాంక సాహిత్యం అందించారు.

'అరెరే కుదురే లేదే .. కరిగే కాలానికే
నిన్నే చూస్తూ ఇలా ... క్షణమే చేజారిందే
తారే నేరుగా ... జారిందిలా నేలకే... నాకోసమే'
అనే లైన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. హరిచరణ్ పాడిన పాట వినసొంపుగా ఉంది.
డై హార్డ్ ఫ్యాన్ చిత్రంలో షకలక శంకర్, రాజీవ్ కనకాల, నోయల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన కాన్సెప్ట్ మోషన్ పోస్టర్‌కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఆగస్టులో డై హార్డ్ ఫ్యాన్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
నటీనటులు: ప్రియాంక శర్మ, శివ ఆలపాటి, షకలక శంకర్, రాజీవ్ కనకాల, నొయల్ తదితరులు
దర్శకుడు: అభిరామ్ ఎం
నిర్మాత: చంద్రప్రియ సుబుద్ధి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్ కింతలి
మాటలు, స్క్రీన్ ప్లే: సయ్యద్ తాజుద్దీన్
సంగీతం: మధు పొన్నాస్
సినిమాటోగ్రఫీ: జగదీష్ బొమ్మిశెట్టి
గ్రాఫిక్స్: తిరు బీ
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: వెంకటేష్ తిరుమల శెట్టి
పీఆర్వో: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్


Click it and Unblock the Notifications











