సరికొత్తగా నీకోసం నిరీక్షణ.. డిజిలైటేషన్‌తో మళ్లీ పదహారేళ్ల వయసు

భారత చిత్ర పరిశ్రమలో నటదిగ్గజాలు సూపర్ స్టార్ రజినీకాంత్, మహానటుడు కమల్ హాసన్, అందాల తార శ్రీదేవి నటీనటులుగా భారతీరాజా దర్శకత్వం వహించిన చిత్రం "పదినారు వయదినిలే". ఈ చిత్రానికి నాలుగు తమిళనాడు రాష్ట్ర పురస్కారాలు లభించాయి. ఉత్తమ నటుడిగా కమల్ హాసన్, ఉత్తమ దర్శకుడిగా భారతీరాజా, ఉత్తమ నేపథ్య గాయనిగా ఎస్. జానకి, ఉత్తమ సంగీత దర్శకుడిగా ఇళయరాజా. ఉత్తమ నేపథ్య గాయనిగా ఎస్. జానకి జాతీయ పురస్కారంతోపాటు ఫిలింఫేర్ పురస్కారాన్ని అందుకోవడం విశేషం.

అత్యం ప్రేక్షకాదరణ పొందిన అలాంటి చిత్రాన్ని ప్రస్తుతం అధునాతన డాల్బీ సౌండ్ పద్ధతుల్లో తెలుగు భాషలోకి అనువదించి, డిజిటలైజ్ చేసి, అన్ని పాటలను మళ్ళీ కొత్తగా పొందుపరచడం జరిగింది. ఈ చిత్రానికి తెలుగులో "నీకోసం నిరీక్షణ" అనే శీర్షిక ను ఖరారు చేశారు.

Digitalisation of Songs and movie of 16 Vayathi

పదహారేళ్ల వయసు చిత్రాన్ని వెయ్యి థియేటర్లలో విడుదల చేయవలసి ఉండగా, ప్రస్తుత విపత్కర పరిస్థితుల మూలంగా సోషల్ మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాల్సి వచ్చింది. తదుపరి ఇంకా అయిదు భాషల్లో దీనిని అనువాదం చేయనున్నట్లు సుప్రీమ్ ఆల్మైటీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ చిత్ర పోస్టర్లు మరియు విశేషాలను ట్విట్టర్, ఫేస్‌బుక్, బామా రాజ్ కణ్ణు యూట్యూబ్ ఛానల్లో ప్రేక్షకులకు అందుబాటులొకి తెచ్చారు.

మధురమైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర నిర్మాత బామా రాజ్ కణ్ణు అభిప్రాయపడ్డారు. ఆదిత్యా మ్యూజిక్ యూట్యూబ్ ద్వారా 5 కొత్త సాంగ్స్ విడుదల చేసినట్టు ఆమె తెలిపారు. పూర్తి సినిమాను తెలుగులో జూన్ నెలలో ఆన్‌లైన్ ద్వారా రిలీజ్ చేస్తామని నిర్మాత బామా రాజ్ కణ్ణు తెలిపారు. సుమారు 30 నిముషాల నిడివి దృశ్యాలను మార్పులు,చేర్పులు చేసి తెలుగు ప్రేక్షకుల ముందు తీసుకొస్తున్నట్టు ఆమె వివరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X