సలార్ పై కొత్త అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. KGF కంటే భారీ స్థాయిలో..
రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలపై అంచనాలు రోజురోజుకు తారా స్థాయికి చేరుతున్నాయి. ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయగలవని ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక మొదటిసారి ఒక కన్నడ దర్శకుడితో వర్క్ చేస్తున్న ప్రభాస్ సలార్ సినిమాతో అంతకు మించి అనేలా హిట్టు కొట్టేలా ఉన్నట్లు అర్ధమవుతొంది.
అసలు మ్యాటర్ లోకి వస్తే సినిమాకు సంబంధించిన మరో స్పెషల్ సర్ ప్రైజ్ త్వరలోనే రానున్నట్లు దర్శకుడు హింట్ ఇచ్చేశాడు. సినిమాకు సంబంధించిన మ్యూజిక్ పనులు కూడా మొదలయ్యాయి. ఈ సినిమాకు KGF కు అద్భుతమైన మ్యూజిక్ అందించిన రవి బసృర్ ఈ సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఈ సినిమాలో మ్యూజిక్ కూడా అంతకు మించి అనేలా ఉంటుందట. మొత్తానికి మ్యూజిక్ కు సంబంధించిన పనులు కూడా స్టార్ట్ అయినట్లు దర్శకుడు ప్రాశాంత్ నీల్ ఒక క్లారిటీ ఇచ్చాడు. ఇక త్వరలోనే మొదటి సాంగ్ కూడా రాబోతున్నట్లు టాక్ వస్తోంది. మరి రవి తన మ్యూజిక్ తో ఏ రేంజ్ లో ఆకట్టుకుంటాడో చూడాలి. ఇక సలార్ సినిమాలో ప్రభాస్ కు జోడిగా శృతి హాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











