Sarkaru Vaari Paata: థమన్ మ్యూజిక్ విషయంలో డైరెక్టర్ అప్సెట్.. మళ్ళీ కొత్తగా..

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అగ్ర హీరోలు తీరిక లేకుండా షూటింగులతో బిజీ అవుతున్నారు. మహేష్ బాబు అయితే సర్కారు వారి పాట సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని జెట్ స్పీడ్ లో వర్క్ చేస్తున్నాడు. ఎందుకంటే మళ్లీ త్రివిక్రమ్ సినిమాతో పాటు రాజమౌళి సినిమాను కూడా స్టార్ట్ చేయాల్సి ఉంది. అందుకే ముందుగా సర్కారు వారి పాట విడుదలకు సిద్ధం చేయాలని చూస్తున్నాడు.

గీత గోవిందం దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అయితే అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్ ఫస్ట్ లుక్ టీజర్ కూడా మంచి హైప్ క్రియేట్ చేసింది. సినిమాకు సంబంధించిన ప్రతి విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే సంగీతం విషయంలో మాత్రం ప్రస్తుతం ఒక టాక్ మాత్రం హాట్ టాపిక్ గా మారింది.

జెట్ స్పీడ్ లోనే SVP షూట్

జెట్ స్పీడ్ లోనే SVP షూట్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలాంటి సినిమా చేసినా కూడా జెట్ స్పీడ్ లోనే ఫినిష్ చేసేందుకు ప్రయత్నం చేస్తాడు. దర్శకుడు కరెక్ట్ గా షెడ్యూల్ ప్లాన్ చేసుకోగలిగితే మహేష్ ఏ మాత్రం ఆలస్యం చేయడని అందరికీ తెలిసిందే. ఇక ఆ విషయంలో కూడా ముందు నుంచి అలాంటి ఆలోచనతోనే వెళుతున్న మహేష్ బాబు మరి కొన్ని రోజుల్లో ఫినిష్ చేసేందుకు అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ షూటింగ్ అయితే తుది దశకు చేరుకుంటోంది.

టార్గెట్ సెట్ చేసుకున్నారు

టార్గెట్ సెట్ చేసుకున్నారు

ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చారు. పోటీగా పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ కూడా సర్కారు వారి పాట రిలీజ్ డేట్ విషయంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని టాక్ వస్తోంది. రిలీజ్ డేట్ విషయంపై ఎన్ని అనుమానాలు ఉన్నా కూడా చిత్ర యూనిట్ మాత్రం పనుల విషయంలో మాత్రం అస్సలు తగ్గడం లేదు. ముందుగా సినిమాను డిసెంబర్ మూడో వారంలోనే పూర్తి చేయాలని ఒక టార్గెట్ అయితే సెట్ చేసుకున్నారు.

మ్యూజిక్ విషయంలో అప్సెట్

మ్యూజిక్ విషయంలో అప్సెట్

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరూ ఊహించని విధంగా ఓక టాక్ అయితే అభిమానులలో కాస్త కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తోంది. మ్యూజిక్ విషయంలో దర్శకుడు పరశురామ్ ఏమాత్రం సంతృప్తిగా లేడట. సంగీత దర్శకుడు తమన్ ఇదివరకే సినిమా కోసం 5 ట్యూన్స్ రెడీ చేసి ఉంచాడు. అందులో రెండు మాస్ సాంగ్స్ కూడా ఉన్నాయి. అయితే 3 సాంగ్స్ విషయంలో పరశురామ్ అంతగా సంతృప్తి కాలేదని తెలుస్తోంది. అందుకే మళ్ళీ కొత్తగా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం.

Recommended Video

Demigod గా Mahesh Babu..Sarkaru Vaari Paata హైలైట్స్.. మరి రిలీజ్ ? || Filmibeat Telugu
వీలైనంత త్వరగా పూర్తి చేయాలని..

వీలైనంత త్వరగా పూర్తి చేయాలని..

తమన్ పరశురామ్ కాంబినేషన్ లో ఇది వరకే ఆంజనేయులు, శ్రీరస్తు శుభమస్తు సినిమాలు వచ్చాయి. ఇక మూడవ సారి సర్కారు వారి పాట కోసం కలిసి వర్క్ చేస్తున్నారు. అయితే సినిమా సంగీతం విషయంలో మొదటి నుంచి కూడా పరశురామ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మొదట్లో ఓకే చేసిన కొన్ని ట్యూన్స్ విషయంలో పరశురాం అంతగా సంతృప్తిగా లేడనే అర్థం అయ్యిందట.

అందుకే మళ్ళీ మరో మూడు పాటల విషయంలో సరికొత్తగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా మొదటి పాటను విడుదల చేసి సినిమా రెగ్యులర్ ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. మరి థమన్ ఈ సినిమాతో ఏలాంటి క్రేజ్ అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X