డిస్కో రాజా: ''నువ్వు నాతో ఏమన్నవో'' సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్

భారీ అంచనాల నడుమ డిస్కో రాజా రూపంలో గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చారు మాస్ మహారాజ్ రవితేజ. గత కొంతకాలంగా సరైన హిట్ పడకపోవడంతో ఈ సారి ఎలాగైనా హిట్ పట్టేయాలని ఫిక్సయిన ఆయన అనుకున్న సక్సెస్ సాధించారు. డిస్కో రాజా మూవీ తొలిరోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకొని అన్ని ఏరియాల్లో విజయవంతంగా ప్రదర్శించబడుతూ చెప్పుకోదగిన కలెక్షన్స్ రాబడుతోంది.

దీంతో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ చేస్తూ కొత్త పోస్టర్స్, వీడియోస్ ద్వారా ప్రేక్షకుల మనసు లాగేస్తోంది డిస్కో రాజా టీమ్. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్రంలోని ''నువ్వు నాతో ఏమన్నవో'' సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. ఈ వీడియోలో రవితేజ, పాయల్ రాజ్‌పుత్ లపై తీసిన సన్నివేశాల తాలూకు క్లిప్పింగ్స్ చూపించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో థమన్ బాణీలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాయి. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

Disco Raja: Nuvvu Naatho Emannavo Song Making video

వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన డిస్కోరాజా మూవీలో రవితేజ సరసన పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటించారు. ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్ల పరంగా జోరుమీదుంది. క్లాస్, మాస్ ఏరియాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా డీసెంట్ కలెక్షన్స్ రాబడుతూ మాస్ మహారాజ్ కెరీర్‌లో హిట్ సినిమాగా పేరు తెచ్చుకుంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X