యంగ్ హీరోయిన్ మసాలా క్రికెట్ స్టెప్ చూశారా?.. మాస్‌ను ఊపేస్తోన్న జూ.ఎన్టీఆర్ బామ్మర్ది ఐటెం సాంగ్
ప్రేక్షకుడిని రెండున్నర గంటల పాటు థియేటర్‌లో కూర్చోబెట్టడానికి మేకర్స్ ఎంతో కష్టపడతారు. అన్ని ఎలిమెంట్స్ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకుని, అందుకు తగిన మార్పులు చేర్పులు చేస్తుంటారు. ఒక సినిమా కథ, కథనంతోనే కాకుండా పాటలు కూడా బ్లాక్‌బస్టర్స్‌గా నిలబడిన ఘటనలు కోకొల్లలు. సినిమాకు పాటలు ప్రాణం వంటివి.. ఆ పాటలకు సంగీతం ఎంత ముఖ్యమో, డ్యాన్స్ కూడా అంతే. పాత రోజులు ఏమో కానీ 80వ దశకం చివరిలో వెండితెరపైకి దూసుకొచ్చిన చిరంజీవి వంటి హీరోలు తమ చిత్రాల్లో డ్యాన్స్‌లకి ఇంపార్టెన్స్ ఇచ్చారు.
మైఖేల్ జాక్సన్‌ను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని మెగాస్టార్ తెలుగు తెరపై ఎన్నో మ్యాజికల్ డ్యాన్స్ మూవ్‌మెంట్స్‌ను తీసుకొచ్చారు. స్ప్రింగ్‌లాగా బాడీని ఎటు కావాలంటే అటు తప్పితూ చిరంజీవి వేసిన స్టెప్స్ ఇండస్ట్రీని షేక్ చేశాయి. సుప్రీంహీరోగా ఉన్న ఆయనను మెగాస్టార్‌గా మార్చడంలో డ్యాన్సులదే కీలకపాత్ర . చిరును ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని ఎంతో మంది డ్యాన్సుల్లో శిక్షణ తీసుకుని హీరోలుగా వెలిగిపోయారు. మధ్యలో ప్రభుదేవా , లారెన్స్, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వంటి కొత్తతరం కొరియోగ్రాఫర్ల రాకతో ట్రెండీ స్టెప్స్ హల్‌చల్ చేస్తున్నాయి.

ఇక సినిమాల్లో డబుల్ మీనింగ్‌తో వచ్చే మాస్ సాంగ్స్ ఈ మధ్యకాలంలో ఒక ఊపు ఊపుతున్నాయి. ఈ ఐటెం నెంబర్ల విషయంలో ఒక్కో డైరెక్టర్‌ది ఒక్కో శైలి. పూరీ జగన్నాథ్, సుకుమార్‌లు మాస్ సాంగ్స్ తీయడంలో మాస్టర్స్ అనిపించుకున్నారు. వారి సినిమాల్లో ఖచ్చితంగా ఐటెం సాంగ్స్ ఉంటాయి. ఇదిలాఉండగా.. యంగ్‌టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా , నయన్ సారిక జంటగా నటిస్తున్న మూవీ 'ఆయ్'. జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తుండగా.. అంజి కె. మణిపుత్ర దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగస్ట్ 15న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
గోదావరి జిల్లాలలో ''ఆయ్'' అనే పదాన్ని ఎక్కువగా వాడుతుంటారు. తీసుకుని ఈ సినిమాకు టైటిల్‌గా నిర్ణయించడం అందరినీ ఆకట్టుకుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఎన్టీఆర్ బావమరిది కావడంతో నితిన్ ఎలా చేశాడోనంటూ ఆడియన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆగస్ట్ 15న చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. మాకున్న ఆడియన్స్ మాకున్నారని ఆయ్ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో సినిమా వచ్చి చాలా రోజులవుతుందని, ఖచ్చితంగా ఈ మూవీని ఎంజాయ్ చేస్తారని వారు ఆకాంక్షిస్తున్నారు.
ఇకపోతే.. ఇటీవల ఈ చిత్రంలో డైవర్షన్ బ్యూటి అంటూ వచ్చిన స్పెషల్ సాంగ్ మాస్‌ని ఊపేస్తోంది. ముఖ్యంగా ఇందులోని క్రికెట్ స్టెప్ బాగా పాపులర్ అయ్యింది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను మంగ్లీ ఆలపించగా, స్నేహా గుప్తా అద్భుతంగా డ్యాన్స్ చేశారు. ఈ సాంగ్ మధ్యలో హీరో వచ్చి క్రికెట్ స్టెప్ వేయ్ అంటూ అరుస్తాడు.. దానికి డ్యాన్సర్ బాల్ తీసుకుని తొడకి బాగా రుద్ది , బాల్ వేసి, బ్యాటింగ్ చేసినట్లుగా మూవ్‌మెంట్స్ ఇస్తుంది. రేపు థియేటర్‌లో ఈ డైవర్షన్ బ్యూటీ సాంగ్‌కి మోతెక్కి పోవాల్సిందే అంటోంది చిత్ర యూనిట్.


Click it and Unblock the Notifications











