twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Rudrangi: ఐటమ్ బాంబ్ గా మారిన దివి వాద్యా.. జగపతి బాబు సినిమాలో స్పెషల్ సాంగ్, వీడియో రిలీజ్!

    |

    ఇటీవల హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్న భామల్లో బిగ్ బాస్ ఫేమ అండ్ బ్యూటిఫుల్ దివి వాద్యా ఒకరు. సూపర్ స్టార్ మహేశ్ బాబు సూపర్ హిట్ మూవీ మహర్షి సినిమాలో చిన్న రోల్ లో తళుక్కుమన్న ఈ సొట్ట బుగ్గల సుందరి బిగ్ బాస్ నాలుగో సీజన్ వల్ల వల్ల యమ పాపులర్ అయిపోయింది. సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు, వీడియోలతో అంతకుమించిన ఫేమ్ దక్కించుకుంది ఈ సొగసరి. ఫలితంగా సినిమాలు, వెబ్ సిరీస్ లలో ఆఫర్లు అందుకుంటూ సినీ కెరీర్ లో జోరుగా ముందుకు సాగుతోంది. ఇటీవలే ఏటీఎమ్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ ఐటమ్ బాంబ్ అవతారం ఎత్తినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

    చిన్న ఆర్టిస్టులు సెలబ్రిటీలుగా..

    చిన్న ఆర్టిస్టులు సెలబ్రిటీలుగా..

    తెలుగులో అత్యధిక పాపులర్ రియాలిటీ షోగా గుర్తింపు పొందింది బిగ్​ బాస్​. ఈ రియాలిటీ షో వల్ల అనేక మంది చిన్న ఆర్టిస్టులు సెలెబ్రిటీలుగా మారిపోయారు. బిగ్ బాస్ తో వచ్చిన ఫేమ్ తో సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ కెరీర్ ను తీర్చిదిద్దుకుంటున్నారు. అలాంటి వారిలో గ్లామరస్ బ్యూటి దివి వాద్యా ఒకరు. బిగ్​ బాస్​ తెలుగు నాలుగో సీజన్​లో అడుగు పెట్టి సూపర్​ పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ. ఇందులోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే దివి వాద్యా పలు సినిమాల్లో నటించింది.

    మహర్షి సినిమాలో..

    మహర్షి సినిమాలో..

    సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది సొట్ట బుగ్గుల వయ్యారి దివి వాద్యా. గ్లామర్ రంగమైన మోడలింగ్ లో తన అందచందాలతో సత్తా చాటిన అందాల దివి 'లెట్స్ గో' అనే షార్ట్ ఫిల్మ్ తో నటిగా సినీ ఇండస్ట్రీలోకి పరిచయం అయింది. ఆ తర్వాత 'సీన్ నెంబర్ 72' సినిమాతో పాటు ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ఈ క్రమంలోనే హాట్ బ్యూటి దివి వాద్యాకు సూపర్ స్టార్ మహేశ్ బాబు చిత్రం 'మహర్షి'లో ఓ సన్నివేశంలో తళుక్కున మెరిసే ఛాన్స్ దక్కింది.

    దివికి దక్కని ఫలితం..

    దివికి దక్కని ఫలితం..

    మహేశ్ బాబు మహర్షి సినిమాలో నటించిన బ్యూటిఫుల్ దివి వాద్యాకు పెద్దగా ఊహించనంతగా గుర్తింపు రాలేదు. పూజా హెగ్డే హీరోయిన్ గా చేసిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ దివి వాద్యాకు మాత్రం అంతగా కలిసి రాలేదు. ఎప్పుడో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన గ్లామరస్ బ్యూటి దివి వాద్యా హీరోయిన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా కూడా అనేక సినిమాలు చేసింది. అందులో కొన్ని సినిమాలు విజయం సాధించినప్పటికి దివికి మాత్రం ఆశించిన ఫలితం దక్కలేదు.

     వెబ్ సిరీస్ లు, సినిమాలతో..

    వెబ్ సిరీస్ లు, సినిమాలతో..

    అయితే అచ్చమైన తెలుగు అందం దివి వాద్యాకు బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం లభించింది. ఈ సీజన్ లోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చిన ఈ సొట్ట బుగ్గల సుందరి తన అందంతో పాటు ఆటతీరుతో ఆకట్టుకుంది. తర్వాత వెంటనే ఎలిమినేట్ అయిన బ్యూటిఫుల్ దివి వాద్యాకు వరుసగా సినీ ఆఫర్స్ రావడం మొదలైంది. ఇందులో భాగంగానే 'నయీం డైరీస్', లంబసింగి వంటి సినిమాలు చేసింది. అలాగే క్యాబ్ స్టోరీస్, మానీళ్ల ట్యాంక్, పరంపర 2 వంటి వెబ్ సిరీస్ ల్లోనూ ఆకట్టుకుంది దివి వాద్యా. అంతేకాకుండా చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో కీలక పాత్ర పోషించింది.

    కిస్సింగ్ సీన్లతో..

    కిస్సింగ్ సీన్లతో..

    ఇక ఇటీవల ఏటీఎమ్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చింది బిగ్ బాస్ దివి వాద్యా. డైరెక్టర్ హరీష్ శంకర్ కథ అందించిన ఈ వెబ్ సిరీస్ లో ఘాటు కిస్సింగ్ సీన్స్ తో ఆకట్టుకుంది. బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్ వీజే సన్నీ హీరోగా నటించిన ఈ వెబ్ సిరీస్ పర్వాలేదనిపించుకుంది. అయితే ఇప్పుడు దివి తాజాగా ఐటమ్ బాంబ్ అవతారం ఎత్తినట్లు తెలుస్తోంది. సీనియర్ హీరో జగపతి బాబు నటించిన రుద్రంగి సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ చేసింది ఈ భామ.

    జాజిమొగులాలి అంటూ..

    జాజిమొగులాలి అంటూ..

    అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించిన రుద్రంగి సినిమాలో మమత మోహన్ దాస్, విమలా రామన్, ఆశిష్ గాంధీ కీలకపాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రంలో దివి వాద్యా ఐటమ్ సాంగ్ చేసింది. జాజిమొగులాలి అనే జానపదంపై దివి వాద్యా నర్తించిన వీడియోను తాజాగా విడుదల చేసింది సినిమా టీమ్. ఈ పాటలో దివి తన ఎద అందాలతోపాటు నడుము, నాభి అందాలతో మెస్మరైజ్ చేసింది. అలాగే తన డ్యాన్స్ తో ఆకట్టుకుంది.

    మంచి రెస్పాన్స్..

    అయితే ఈ రుద్రంగి సినిమాలో దివి వాద్యా కేవలం ఐటమ్ సాంగ్ కే పరిమితం అవుతుందో.. లేదా ఏదైనా పాత్ర చేస్తుందో ఇంకా తెలియరాలేదు. ఈ పాటను నవ్ ఫాల్ రాజా అయిస్ కంపోజ్ చేయగా.. మోహన భోగరాజు ఆలపించింది. అభినయ శ్రీనివాస్ లిరిక్స్ అందించిన ఈ పాటకు భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ పాటతో దివి వాద్యా కెరీర్ మరింత జోరందుకోనున్నట్లు తెలుస్తోంది.

    English summary
    Actress Divi Vadthya Latest Special Song Jajimogulali Video Released From Jagapathi Babu Mamta Mohandas Rudrangi Movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X