Rules Ranjann Song అదరగొట్టిన డీజే టిల్లూ భామ.. సమ్మోహనుడా అంటూ కిరణ్ అబ్బవరంతో ఫుల్ రొమాంటిక్‌గా!

తెలుగు సినిమా పరిశ్రమలో రాజా వారు రాణి గారు, ఎస్ఆర్ కల్యాణ మండపం, వినరో భాగ్యము విష్ణు కథ చిత్రాలతో తనకంటూ ఇమేజ్ ఏర్పరుచుకొన్న యువ హీరో కిరణ్ అబ్బవరం. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ప్రతీ సినిమాకు మార్కెట్ పెంచుకొంటూ వెళ్తున్న ఈ యువ హీరో తాజాగా నటించిన చిత్రం రూల్స్ రంజన్. ఈ చిత్రంలో డీజే టిల్లుతో యువత గుండెల్లో గిలిగింతలు పెట్టిన అందాల భామ నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకు రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూల్స్ రంజన్ సినిమాను దివ్యాంగ్ లావణ్య , మురళీ కృష్ణ వేమూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అమ్రీష్ సంగీతం అందిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి సమ్మోమనుడా అనే రెండో పాట విడుదల చేశారు.

DJ Tillu fame Neha Shettys beautiful chemistry with Kiran Abbavaram in Sammohanuda Song of Rules Ranjann goes Viral

ఈ సెకండ్ సింగిల్‌ సమ్మోహనుడా పాటను ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ పాడారు. ఈ పాటకు రాంబాబు గోసాల, రత్నం కృష్ణ సాహిత్యం అందించారు. యువ కొరియోగ్రాఫర్ శిరీష్ నృత్యాలు సమకూర్చిన ఆ సాంగ్ ఫుల్ రొమాంటిక్ మూడ్‌తో సాగింది. ఈ చిత్రంలోని ఐదు పాటలకూ ఆయనే నృత్య దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

ప్రియుడి కోసం విరహ వేదన అనుభవించే ప్రియురాలి నేపథ్యంగా సమ్మోహనుడా పాట సాగింది. ఈ పాటలో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయేలా కనిపించింది. సమ్మోహనుడా పెదవిస్తా నీకే కొంచెం కొరుక్కోవా. ఇష్టసఖుడా నడుమిస్తా నీకే నలుగే పెట్టుకోవా అంటూ నాయిక తన ప్రియుడైన కథానాయకుడికి తన దేహాన్ని అర్పిస్తానని పాడుతున్నట్టుగా పాట ప్రారంభమైంది. సందెపొద్దే నువ్వైతే చల్లని గాలై వీస్తా. మంచు వర్షం నువ్వే అయితే నీటి ముత్యాన్నవుతా లాంటి పంక్తులలో పాట ఎంతో అందంగా సాగింది.

DJ Tillu fame Neha Shettys beautiful chemistry with Kiran Abbavaram in Sammohanuda Song of Rules Ranjann goes Viral

సమ్మోహనుడా పాటలో నేహా శెట్టి గ్లామర్ అవతారంలో ఇరుగదీసింది. కిరణ్ అబ్బవరంతో కలిసి రొమాంటిక్ మూడ్‌ను ఎలివేట్ చేసింది. నేహా శెట్టి ధరించిన దుస్తులు క్రేజీగా మారాయి. ఇలాంటి క్రేజీ పాటను హైదరాబాద్‌లో సెట్ వేసి చిత్రీకరించారు.

DJ Tillu fame Neha Shettys beautiful chemistry with Kiran Abbavaram in Sammohanuda Song of Rules Ranjann goes Viral

తారాగణం: కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, అన్నూ కపూర్, అజయ్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, నెల్లూరు సుదర్శన్, గోపరాజు రమణ, అభిమన్యు సింగ్, సిద్ధార్థ్ సేన్
రచన, దర్శకత్వం: రత్నం కృష్ణ
బ్యానర్: స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్
సమర్పణ: ఏఎం రత్నం
నిర్మాతలు: దివ్యాంగ్ లవణియా, మురళి కృష్ణ వేమూరి
సహ నిర్మాత: రింకు కుక్రెజా
మ్యూజిక్: అమ్రిష్ గణేష్
సినిమాటోగ్రఫి: దులీప్ కుమార్
ఆర్ట్ డైరెక్టర్: ఎం సుధీర్
ఎడిటర్: వరప్రసాద్
పీఆర్వో: లక్ష్మీ వేణుగోపాల్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X