Liam Payne net worth: లియామ్ పేన్ ఆస్తులు ఎన్ని వందల కోట్లు.. ఎంత మంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారో తెలుసా?

బ్రిటన్ గాయకుడు, మాజీ వన్ డైరెక్షన్ బ్యాండ్ సభ్యుడు లియామ్ పేన్ హఠాన్మరణం మ్యూజిక్ లవర్స్‌ను తీవ్ర విషాదంలోకి ముంచెత్తింది. అర్జెంటీనాలోని బ్యూనోస్ ఎయిర్స్ నగరంలోని ఓ హోటల్‌లోని 3వ అంతస్తు నుంచి దూకి మరణించడం సంగీత ప్రపంచాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. ఎంతో భవిష్యత్ ఉన్న ఆయన కెరీర్ కేవలం 31 సంవత్సరాల వయసులోనే ముగియడం అందర్నీ కలిచివేస్తున్నది. ఆయన వ్యక్తిగత జీవితం, ఆయన సంపాదనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

లియామ్ పేన్ మరణం అనుమానాస్పదంగా మారడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకొన్నాడు? ఆయనను ఎవరైనా చంపారా? ఆయన మరణం ప్రమాదమే అయితే అందుకు ఆల్కాహల్, డ్రగ్స్ కారణమయ్యాయా? అనే ప్రశ్నలు అభిమానులను, సంగీత ప్రియులను వెంటాడుతున్నాయి.

Do You Guess Liam Payne Net Worth Estimated Here is One Direction Star Girl Friends List

లియామ్ వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆయన లైఫ్‌లో ఎన్నో లవ్ అఫైర్, బ్రేకప్స్ ఉన్నాయి. 2010 నుంచి 2012 వరకు X Factor డ్యాన్సర్ డానీల్లే పీజర్‌తో డేటింగ్ చేశాడు. ఆ తర్వాత చిన్ననాటి స్నేహితురాలు సోఫియా స్మిత్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. ఆ తర్వాత సింగర్ చెరిల్ కోల్‌తో డేటింగ్ చేశాడు. అనంతరం బ్రిటన్ నటి నోమి క్యాంప్‌బెల్‌తో సహజీవనం చేశారు.

ఆ తర్వాత బ్రిటన్ మోడల్ మాయా హెన్నీతో డేటింగ్ చేస్తూ 2019లో ఎంగేజ్‌మెంట్ చేసుకొన్నారు. ఆ తర్వాత రెండేళ్లకు వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఓ ఏడాదికి మళ్లీ కలిసి మళ్లీ నిశ్చితార్థం చేసుకొన్నారు. ప్రస్తుతం ఆయన కేట్ కాసిడీ అనే ఇన్స్‌ఫ్లూయెన్సర్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు.

Do You Guess Liam Payne Net Worth Estimated Here is One Direction Star Girl Friends List

ఇదిలా ఉండగా, ఆయన సంపాదన విషయంలోకి వెళితే.. ఈతరం మ్యూజిక్ లెజెండ్స్‌లో అత్యధిక ఆస్తులున్న ప్రముఖుడిగా గుర్తింపు పొందారు. 2020 సంవత్సరంలో ఆయన ఆస్తిని సుమారుగా 47 మిలియన్ డాలర్లు అంటే సుమారుగా 400 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. ప్రస్తుత అంచనా ప్రకారం ఆయన ఆస్తి సుమారుగా 650 కోట్ల నుంచి 700 కోట్ల రూపాయలు ఉంటుందని పేర్కొంటున్నారు.

ఇదిలా ఉండగా, లియామ్ వద్ద ఇతర విలువైన సంపద ఉంది. మలిబు, కాలిఫోర్నియాలో, సర్రేలో సొంతంగా విలాసవంతమైన విల్లాలు ఉండేవి. వాటిని ఇటీవల అమ్మేశాడు. ఆయన చివరి శ్వాస వదిలే సమయానికి బకింగ్‌హమ్‌షైర్‌లో నివాసం ఉంటున్నారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేని అభిమానులు సోషల్ మీడియాలో ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: liam payne cheryl cole
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X