Justin Bieber అనంత్ అంబానీ సంగీత్‌ వేడుకలో జస్టిన్ బీబర్.. ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారో తెలుసా?

ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివాహానికి సంబంధించిన ప్రముఖులు ఒక్కొక్కరుగా ముంబైకి చేరుకొంటున్నారు. అయితే కనివీని ఎరుగని రీతిలో పెళ్లిని జరిపించేందుకు అంబానీ కుటుంబం భారీగా ఏర్పాట్లు చేస్తున్నది. ఈ పెళ్లిలో భాగంగా జరిగే సంగీత్ కోసం వరల్డ్ పాపులర్ పాప్ సింగర్ జస్టిన్ బిబర్ ముంబైకి చేరుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. జస్టిన్ బీబర్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

కెనడాకు చెందిన పాప్ సింగర్. ప్రపంచంలోనే అత్యుత్తమ గాయకుడు. కోట్లాది మంది అభిమానులు ఉన్న గాయకుడు. మై వరల్డ్, అండర్ ది మిసిల్‌టో, బిలీవ్, పర్పస్, ఛేంజెస్, జస్టిస్ లాంటి ఆల్బమ్స్‌లో పాపులర్ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకొన్నారు.

Do you Know How Much Justin Bieber paid for Ananth Ambani and Radhika Marchat Sangeet Ceremony

జూలై 12వ తేదీన ముఖేష్, నీతా అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, వీరెన్ మర్చంట్ కూతురు రాధిక అంబానీ వివాహం జరుగున్నది. ఈ పెళ్లికి ముందు ముంబైలోని బీకేసీ కల్చరల్ సెంటర్‌లో సంగీత్ కార్యక్రమం జరుగనున్నది. ఈ వేడుకలో జస్టిన్ బీబర్ ప్రత్యేక ఆకర్షణగా మారనున్నారు.

పెళ్లికి ముందు జరిగే సంగీత్, హల్దీ లాంటి వేడుకల్లో జస్టిన్ బీబర్ పాల్గొంటారు. ఆయన ఈ వేడుకల్లో పాల్గొనేందుకు భారీగా రెమ్యునరేషన్ చెల్లించారని ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించింది. దాంతో ఆయన జూలై 5వ తేదీన ముంబైకి చేరుకోగా.. భారీగా స్వాగతం పలికారు.

Do you Know How Much Justin Bieber paid for Ananth Ambani and Radhika Marchat Sangeet Ceremony

ఇక అంబానీ వివాహ వేడుకల్లో భాగంగా జరిగే సంగీత్ కార్యక్రమంలో పాల్గొనేందుకు జస్టిన్ బీబర్‌కు సుమారుగా 10 మిలియన్ డాలర్లు అంటే అక్షరాల భారతీయ కరెన్సీలో 83 కోట్ల రూపాయలు చెల్లించినట్టు మీడియా వర్గాలు కథనాలు వెల్లడించాయి. 2017లో ఆయన ఇండియాలో ఓ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఇది రెండోసారి కావడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X