Rahul Sipligunj: విఠ్ఠల రాహుల్.. రాహుల్ సిప్లిగంజ్‌లా ఎలా మారాడో తెలుసా?
రాహుల్ సిప్లింగజ్.. ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రియులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఈయన తన అద్భుతమైన గాత్రంతో దేశ ప్రజలందరినీ ఉర్రూతలూగించే స్థాయికి ఎదిగారు. ఓవైపు పాటలు పాడుతూనే మరోవైపు సొంతంగా వీడియో అల్బమ్స్ చేస్తూ.. సెన్సేషన్ క్రియేట్ చేసిన బిగ్ బాస్ షో విన్నర్ గా కూడా నిలిచాడు. ఇలా తెలుగు ప్రేక్షకులు ఫేవరెట్ గా మారిన ఈయన అసలు పేరు విఠ్ఠల రాహుల్ అని తెలిపాడు. అయితే ఆయన పేరులోంచి విఠ్ఠల పోయి సిప్లిగంజ్ ఎలా వచ్చిందో తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వృత్తిరీత్యా రాహుల్ సిప్లిగంజ్ తండ్రి బార్బర్. ఒకప్పుడు రాహుల్ కూడా బార్బర్ షాపులో పని చేసేవాడు. ఓవైపు పాటలు పాడుతూనే.. సినిమాల్లో ట్రై చేసిన ఈయన అవేవీ సెట్ కాకపోతే సెలూన్ అయినా పెట్టుకోవాలని ఆ పని నేర్చుకున్నట్లు తెలిపాడు. కానీ తనలోని టాలెంట్ గుర్తించిన తల్లిదండ్రులు అండగా నిలవగా.. ఆయన తన సొంత డబ్బులతో ఆల్బమ్ సాంగ్స్ చేయడం ప్రారంభించాడు. అందులో డ్యాన్సులు కూడా చేస్తూ విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక ఆ తర్వాత 2009లో వచ్చిన జోష్ సినిమాలోని కాలేజ్ బుల్లోడ పాట పాడి సినీ రంగ ప్రవేశం చేశాడు. ఇక అప్పటి నుంచి అదిరిపోయే పాటలు పాడుతూ.. అందరినీ ఉర్రూతలూగిస్తున్నాడు. అలా వచ్చిన గుర్తింపుతోనే బిగ్ బాస్ సీజన్ 3 షోకు వెళ్లాడు. అక్కడ తన ఒరిజినల్ క్యారెక్టర్ ను చూపించి.. తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఆ సీజన్ విన్నర్ గా కూడా నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇక బయటకు వచ్చిన తర్వాత ఊకో కాక అనే క్లాతింగ్ బ్రాండ్ స్టోర్ పెట్టాడు. అలాగే బార్బర్ షాపులు కూడా పెట్టి డెవలప్ చేశాడు.
ఇదంతా చేస్తూనే మరోవైపు తన సింగింగ్ కెరియర్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకు వెళ్లాడు. ఇలా అద్భుతమైన టాలెంట్ ను అందరికీ పరిచయం చేస్తూ సన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈయన పూర్తి పేరు విఠ్ఠల రాహుల్ సిప్లిగంజ్. అయితే విఠ్ఠల రాహుల్ అనేది ఈయన పేరు. సిప్లిగంజ్ అనేది మాత్రం ఇంటి పేరు. అయితే మొదట్లో రాహుల్.. ఎక్కడైనా తన పేరును విఠ్ఠల రాహుల్ గానే రాసుకునేవాడట. అందరికీ అలాగే చెప్పేవాడట.

కానీ తాను కీరవాణి దగ్గర పాటలు పాడుతున్న సమయంలో... ఆయన చెక్స్ రాసిచ్చేవారట. అలా చెక్ రాస్తున్న సమయంలో రాహుల్ సిప్లిగంజ్ అని రాసి ఈ పేరు చాలా బాగుందని.. నీవు ఈ పేరును కంటిన్యూ చెయ్.. కచ్చితంగా నీకు మంచి గుర్తింపు వస్తుందని వివరించాడట. అదంతా విన్న రాహుల్ తన పేరును విఠ్ఠల రాహుల్ నుంచి రాహుల్ సిప్లిగంజ్ గా మార్చుకుని.. అలాగే కంటిన్యూ చేస్తున్నాడట. ఈ పేరు కొత్తగా ఉండడంతో అందరి నోళ్లలో నాని తనకు మంచి గుర్తింపు వచ్చిందని తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











