మామా చూడరో.. అదరగొట్టేసిన విజయ్ దేవరకొండ
నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో 'డియర్ కామ్రేడ్' మూవీ తెరకెక్కింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. కాగా తాజాగా ఈ చిత్రంలో మామా చూడరో.. అంటూ హుషారెత్తిస్తున్న లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
ఈ సాంగ్‌లో లుంగీ కట్టుకొని యమ హుషారుగా డాన్స్ చేస్తూ కనిపిస్తున్నాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. ఆయనతో పాటు చీరకట్టులో రష్మిక మందన్న కూడా హుషారెత్తించింది. సినిమాలో ఓ పెళ్లి వేడుకలో భాగంగా ఈ సాంగ్ రానుందని తెలుస్తోంది. నరేష్ అయ్యర్ పాడిన ఈ పాటకు వివేకా లిరిక్స్ అందించారు. ఈ సినిమా థియేటర్‌కి వచ్చిన ఆడియన్స్‌కి స్పెషల్ ట్రీట్ ఇస్తుందని చెప్పుకోవచ్చు.

తెలుగుతో పాటు తమిళ, మళయాల, కన్నడ భాషల్లో ఏక కాలంలో డియర్ కామ్రేడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా చూసిన కరణ్ జోహార్.. హిందీ రీమక్స్ రైట్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించిన డియర్ కామ్రేడ్ చిత్రానికి నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, రవిశంకర్, యష్ రంగినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ క్యారెక్టర్ వెరీ వెరీ స్పెషల్ అని తెలుస్తోంది. భారీ అంచనాల నడుమ జులై 26 వ తేదీన డియర్ కామ్రేడ్ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











