ఒళ్లంతా సలి మంటలే.. దిండ్లూ, దుప్పట్లు సరిపోతాలే.. డబుల్ ఇస్మార్ట్ సాంగ్ ట్రెండింగ్!
సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్‌లో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ చిత్రం బాక్సాఫీస్‌పై ప్రభావం చూపలేకపోయింది. కానీ ఆ సినిమా పాటలు మాత్రం యూట్యూబ్, సోషల్ మీడియాలో విశేషంగా ఆలరిస్తున్నాయి. చార్మీ కౌర్, పూరీ జగన్నాథ్ నిర్మాతలుగా పూరీ కనెక్ట్ బ్యానర్‌పై రూపొందించిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్‌లో పాటలు మాత్రం ట్రెండింగ్‌గా మారాయి.ఈ సినిమాలోని ట్రెండ్ అవుతున్న ఈ పాట గురించిన వివరాల్లోకి వెళితే..
డబుల్ ఇస్మార్ట్ ఆడియోలోని దాదాపు అన్ని పాటలకు సంగీత ప్రియుల నుంచి భారీ స్పందన లభిస్తున్నది. క్యా లఫ్డా అనే పాట యూత్‌కు కిర్రాక్ ఎక్కిస్తున్నది. మణిశర్మ సంగీతం అందించిన ఈ పాట వివరాల్లోకి వెళితే..

రబ్బా రబ్బా..
నరమ్ నరం
గరమ్ గరమ్
పదింటికి చలి జ్వరం
నీ ఊహలే..నిరంతరం
పోతుందిరా..నాలో శరం
ఏమీ చేశావు మహాశయా..
కమ్ముకొంటుంది యూఫోరియా
బరువైతాందీ.. ఛాతీ ఏరియా
కాలే నిలువకుంది..
క్యా హోగయా?
సుట్టు ఒళ్లంతా సలి మంటలే
దిండ్లూ, దుప్పట్లు సరిపోతాలే
మందు కొడుతున్నా
మత్తు వస్తాలే..
కోళ్లు కూస్తున్నా
నిదుర వస్తాలే అంటూ సాగే పాట యువతరానికి బాగా కనెక్ట్ అయింది.
ఇలా రొమాంటిక్‌గా, మత్తుకెక్కించే పాటను ధనుంజయ్సీపాన, సింధుజా శ్రీనివాసన్ ఆలపించారు. శ్రీ హర్ష ఇమానీ సాహిత్యం అందించారు. మణిశర్మ మ్యూజిక్ అందించగా, శోభీ మాస్టర్ కొరియోగ్రఫిని అందించారు.
ఈ పాటపై రామ్ పోతినేని, కావ్య థాపర్ కెమిస్ట్రీ, రొమాంటిక్ మూడ్స్ అదరగొట్టేలా ఉంది. ఇక జూలై 29వ తేదీన రిలీజైన ఈ పాట ఇప్పటికే 4 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఇంకా ఈ సాంగ్‌ను రిపీట్ మోడ్‌లో వింటున్నారనే విషయం వ్యూస్‌తో స్పష్టమవుతున్నది.


Click it and Unblock the Notifications











