దీపికా పదుకొణెను టార్గెట్ చేసిన డీజే బ్రావో.. ఇంట్రెస్టింగ్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. డార్లింగ్ ప్రభాస్ తో కలిసి 'కల్కి 2898 ఏడీ' చిత్రంలో నటించి దక్షిణాది ఆడియెన్స్ ను కూడా ఫిదా చేసింది. ఇక బాలీవుడ్ లో దీపికా పదుకొణె ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈమె కెరీర్ ప్రారంభమైంది మాత్రం సౌత్ నుంచే. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర సరసన హీరోయిన్ గా నటించి తొలుత వెండితెరపై మెరిసింది దీపికా పదుకొణె.
ఆ తర్వాత బాలీవుడ్ లో ఓం శాంతి ఓం చిత్రంతో అడుగుపెట్టింది. 2007లో ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి బాలీవుడ్ లో దీపికా పదుకొణె బాలీవుడ్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఇక తన టాలెంట్, నటన, అందంతో కోట్లల్లో అభిమానులను సంపాదించుకుంది. అయితే దీపికా పదుకొణెను మాజీ క్రికెటర్ డ్వేన్ బ్రావో ఎంతగానో అభిమానిస్తాడు. లైఫ్ లో ఒక్కసారైనా దీపికా పదుకొణెను కలవాలని అప్పట్లో పరితపించాడు.

క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత డ్వేన్ బ్రావో సింగర్ గా అవతారం ఎత్తాడు. అతను స్వయం పాడిన 'డీజే బ్రావో ఛాంపియన్' సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా హిట్ అయ్యింది. మరోవైపు ఎంఎస్ ధోనీ, సీఎస్కే టీమ్ పై పాడిలన్నీ హిట్ అయ్యాయి. క్రికెట్ ధీరులపై వరుసగా పాటలు పాడుకుంటూనే వచ్చారు. ఇక ఇప్పుడు డీజే బ్రాబో పాపులర్ సింగర్ శివాంగి శర్మతో కలిసి మ్యూజిక్ వీడియోల్లో నటిస్తున్నారు. చివరిగా పార్టీ పార్టీ అనే మ్యూజిక్ వీడియోను విడుదల చేశారు. రీసెంట్ గా 'ఇండియా కా ఐపీఎల్' అనే సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు.
అయితే ఆ మ్యూజిక్ వీడియో కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఐపీఎల్ సీజన్ సందర్భంగా వదలడంతో హిట్ అయ్యింది. ఇక రీసెంట్ గా డీజే బ్రావో, సింగర్ శివాంగి శర్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ లో ఎవరితో కలిసి పనిచేయాలని భావిస్తున్నారంటూ డీజే బ్రావోకు ఎదురైన ప్రశ్నకు ఏమాత్రం ఆలోచించుకుండా దీపికా పదుకొణె అని సమాధానం ఇచ్చారు. డీజే బ్రావో ప్రస్తుతం ఇంటర్నేషనల్ వైడ్ గా క్రేజ్ పొందుతున్న సంగతి తెలిసిందే.
డీజే బ్రావో, శివాంగి శర్మ తమ నెక్ట్స్ మ్యూజిక్ వీడియోకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెతో కొలాబరేట్ కాబోతున్నారా? అనే సందేహం కలిగింది. అయితే వారిద్దరూ కావాలనే ఆమె పేరును ప్రస్తావించి నెక్ట్స్ మ్యూజిక్ వీడియోలో కలిసి పనిచేయబోతున్నారని ప్రకటంచినట్టు తెలుస్తోంది. దీపికా కూడా గతంలో 'నామ్ హే తేరా, ఫిర్ మిలే సర్ మెరా తుమ్హరా, బోలిడ్యూడ్ గణేషన్' వంటి మ్యూజిక్ వీడియోల్లో నటించింది. ఇక డ్వేన్ బ్రావో దీపికా పదుకొణెకు వీర అభిమాని, దాంతో ఆమెతో కలిసి మ్యూజిక్ వీడియో చేయాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. దీపికా పదుకొణె రీసెంట్ గా 'సింగమ్ ఎగైన్' చిత్రంలో అలరించింది. మరోవైపు తెలుగులో 'కల్కి 2' చిత్రంలోనూ నటించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











