F3: రొమాంటిక్ సాంగ్‌తో సర్‌ప్రైజ్.. స్పెషల్ అట్రాక్షన్‌గా వాళ్ల గ్లామర్ ట్రీట్
తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంత కాలంగా మల్టీస్టారర్ మూవీల హవా ఎక్కువగా కనిపిస్తోంది. గతంతో పోల్చుకుంటే ఇప్పటి ప్రేక్షకులు, హీరోల అభిమానుల ఆలోచనా ధోరణిలో మార్పులు రావడంతో ఫిల్మ్ మేకర్లు ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు. ఫలితంగా ఇలాంటి సినిమాలను అందిస్తున్నారు. ఇలా ఇటీవల వచ్చిన చాలా చిత్రాలు సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. అలాంటి వాటిలో మూడేళ్ల క్రితం సంక్రాంతి సీజన్‌లో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. భారీ విజయాన్ని అందుకున్న 'F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) ఒకటి. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా విడుదలైన ఈ సినిమా కలెక్షన్లు వర్షం కురిపించింది.
'F2' సూపర్ డూపర్ హిట్ అవడంతో దీనికి కొనసాగింపుగా 'F3'ని రూపొందించాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయిపోయింది. అయితే, దర్శకుడు అనిల్ రావిపూడి వేరే ప్రాజెక్టుతో బిజీగా ఉండడంతో ఇది కాస్తా ఆలస్యం అయిన విషయం తెలిసిందే. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత 'F3' పేరిట ఈ సినిమాను రెండేళ్ల క్రితమే ప్రకటించడంతో పాటు షూటింగ్ కూడా వెంటనే మొదలు పెట్టేశారు. అయితే, మధ్యలో అనుకోని అవాంతరాలు ఎదురు కావడంతో ఈ సినిమా అనుకున్న సమయానికి పూర్తి కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే జరిగిన స్పెషల్ సాంగ్‌తో ఈ సినిమా షూటింగ్ భాగం మొత్తాన్ని పూర్తి చేసుకున్నారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న 'F3'లో ముగ్గురు హీరోలు నటిస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, ఇందులో ఇద్దరే నటిస్తారని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఇక, కొండాపూర్‌లో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో ఈ సినిమా సన్నివేశాలను షూట్ చేశారు. మనీ వల్ల వచ్చే ప్రస్టేషన్స్ ఎలా ఉంటాయోనన్న కథతో ఈ మూవీ వస్తుందని దర్శకుడు అనిల్ రావిపూడి వెల్లడించాడు. ఇక, ఈ సినిమాలో మరింత ఫన్ క్రియేట్ చేసేందుకు సునీల్, సోనాల్ చౌహాన్ కూడా తీసుకొచ్చి వాళ్లకు స్పెషల్ క్యారెక్టర్లు రాసుకున్నారు. అలాగే, మరెన్నో హైలైట్ పాయింట్లను కూడా ఈ సినిమాలో జత చేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
'F3' మూవీని మే 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో దీని నుంచి పాటలను ఒక్కొక్కటిగా వదలాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే తాజాగా దీని నుంచి 'ఊఆహాహా' అంటూ సాగే ఓ రొమాంటిక్ సాంగ్‌ను విడుదల చేశారు. ఇందులో వెంకటేష్ - తమన్నా, వరుణ్ తేజ్ - మెహ్రీన్ మధ్య కెమిస్ట్రీ అదిరిపోయేలా చూపించారు. అలాగే, సోనాల్ చౌహాన్, సునీల్ స్టెప్పులు కూడా బాగున్నాయి. ఇక, ఈ పాటను దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేయగా.. కాసర్ల శ్యామ్ లిరిక్స్ ఇచ్చారు. ఈ పాటను సునిధీ చౌహాన్, లవితా లోబో, సాగర్, ఎస్పీ అభిషేక్‌లు ఆలపించారు.
సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలయికలో వస్తున చిత్రమే 'F3'. బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ హీరోయిన్లు. ఇప్పుడు సునీల్, సోనాల్ చౌహాన్ కూడా ఇందులో భాగం అయ్యారు. ఇక, ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం ఇస్తున్నాడు. ఈ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











