సునీతకు అభిమాని భార్య షాక్.. దండం పెట్టేసి వెళ్లిపోయిన సింగర్.. ఈ వీడియో చూశారా?

తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది సింగర్లు వచ్చారు. అందులో చాలా తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపును దక్కించుకుని స్టార్లుగా మారారు. అలాంటి వారిలో సునీత ఒకరు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా సినీ రంగంలో తనదైన శైలి గాత్రంతో కొన్ని వేల పాటలను ఆలపించిన ఆమె.. కోయిల వంటి స్వరంతో శ్రోతలను తన వైపునకు తిప్పుకున్నారు. అయితే, ఇప్పుడు గతంలో మాదిరిగా బిజీగా లేకున్నా.. సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సునీత ఓ క్రేజీ వీడియోను షేర్ చేశారు. దానిపై ఒక్కసారి లుక్కేయండి మరి!

టీనేజ్‌లో మొదలైన ప్రస్థానం
టీనేజ్‌లో ఉన్నప్పుడే సునీత సంగీతం మీద పట్టు సాధించాలని శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత ఎన్నో కార్యక్రమాల్లో పాటలు పాడారు. ఈ క్రమంలోనే 15 ఏళ్ల వయసులో ప్లేబ్యాక్ సింగర్‌గా తన ప్రస్థానాన్ని ఆరంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల పాటలను పాడారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు.

Fan Gives Shocks Singer Sunitha At Private Event Video Goes Viral

చిన్న వయసులో విడాకులు
కెరీర్ పరంగా ఎదుగుతోన్న సమయంలో సింగర్ సునీత.. కిరణ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. చాలా కాలం పాటు సవ్యంగానే సాగిన వీళ్ల కాపురంలో విభేదాలు వచ్చారు. దీంతో న్యాయ పరంగా విడాకులు తీసుకుని విడిపోయారు. అప్పటి నుంచి ఇద్దరు పిల్లల బాధ్యతను తీసుకున్న ఆమె.. వాళ్లను పెంచి పోషిస్తున్నారు.

అతడితో వివాహం జరిగింది
భర్తతో విడిపోయిన కొంత కాలం నుంచే సునీత రెండో పెళ్లి గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ, అవి పుకార్లుగానే మిగిలిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొన్నేళ్ల క్రితమే ఆమె ప్రముఖ మీడియా సంస్థ అధినేత రామ్ వీరపనేనితో రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఓ ఆలయంలో సింగర్ సునీత వివాహం ఎంతో గ్రాండ్‌గా జరిగింది.

Fan Gives Shocks Singer Sunitha At Private Event Video Goes Viral

పెళ్లి తర్వాత ఫుల్ యాక్టివ్‌గా
రామ్‌ను వివాహం చేసుకున్న తర్వాత సునీత జీవితంలో జోష్ పెరిగింది. అప్పటి నుంచి ఆమె తరచూ ఏదో ఒక ప్రదేశాన్ని సందర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ మధ్య తన భర్తతో కలిసి సునీత.. భూలోక స్వర్గంగా పేరున్న మాల్దీవులు టూర్ వెళ్లారు. అక్కడి రిసార్టులు, బీచ్‌లలో తెగ ఎంజాయ్ చేశారు. కెరీర్ పరంగా కూడా తనదైన రీతిలో సునీత ముందుకు సాగుతోంది.

ఎప్పుడూ అందులోనే బిజీ
కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా లేకున్నా సింగర్ సునీత సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇందులో భాగంగానే తరచూ తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తున్నారు. అంతేకాదు, వ్యక్తిగత, కెరీర్‌కు సంబంధించిన విశేషాలను తన ఫాలోవర్లతో పంచుకుంటున్నారు. ఇలా తన ఫాలోయింగ్‌ను సైతం క్రమంగా పెంచుకుంటూనే ఉన్నారు.

Fan Gives Shocks Singer Sunitha At Private Event Video Goes Viral

ఆశ్చర్యపరిచిన అభిమాని
సింగర్ సునీత తరచూ ఏదో ఒక ప్రైవేట్ ఈవెంట్‌లో పాల్గొంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అది ముగిసిన తర్వాత ఆమెను అభిమానించే కొందరు ఫొటోలు దిగేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఓ ఫ్యాన్ తనకు సునీత అంటే చాలా అభిమానం అని, కానీ తన భార్య జెలసీ ఫీల్ అవుతుందని చెప్పి షాక్ ఇచ్చేశాడు.

నా భార్య కుళ్లుకుంటుంది
అభిమాని అన్న మాటలకు సంబంధించిన వీడియోను సునీత ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. ఇందులో అతడు 'నేను సునీత మేడంను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను. దీంతో నా భార్య కుళ్లుకుంటుంది' అని చెప్పుకొచ్చాడు. దీంతో అతడితో మరోసారి ఈ మాటలను చెప్పించి వీడియో తీశారు. ఫలితంగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X