'హలో గురు ప్రేమ కోసమే' ఫస్ట్ సాంగ్.. మళ్ళీ మ్యాజిక్ చేసిన దేవిశ్రీ!

రామ్, అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న తాజా చిత్రం హలో గురు ప్రేమ కోసమే. నేను లోకల్ ఫేమ్ త్రినాథ్ రావు దర్శత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్ గా అలరించేందుకు సిద్ధం అవుతోంది. ఇటీవల విడుదలైన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రామ్ నటించిన నేను శైలజ, ఉన్నది ఒక్కటే జిందగీ చిత్రాలకు సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నాడు.

తాజగా ఈ చిత్రంలోని మై వరల్డ్ ఈజ్ ఫ్లైయింగ్ అనే లిరికల్ వీడియోని విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్ మార్క్ తో పాట వినగానే నచ్చేసేలా ఉంది. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించాడు. అల్ఫోన్ జోసెఫ్ పాటని అద్భుతంగా పాడాడు. దసరా కానుకగా చిత్రాన్ని అక్టోబర్ 18 న విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.

దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది. రామ్ ఈ చిత్రంపై భారీగానే ఆశలు పెట్టుకుని ఉన్నాడు. రామ్ నటించిన గత చిత్రాలు వరుసగా నిరాశపరుస్తూ వచ్చాయి. అనుపమ పరమేశ్వరన్ కి కూడా ఈ చిత్రం విజయం సాధించడం చాలా కీలకం.

First lyrical video of Hello Guru prema kosame released

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X