అరవింద సమేత.. తమన్ నుంచి సడెన్ సర్‌ప్రైజ్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం అరవింద సమేత. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో అరవింద సమేత ప్రమోషన్స్ నెమ్మదిగా జోరందుకుంటున్నాయి.
ఇటీవల విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ రావడమే కాదు సినిమాపై అంచాలు కూడా పెంచేసింది. ఇపుడు చిత్ర యూనిట్ ఆడియో విడుదల చేసేందుకు సిద్ధం అవుతోంది. ఈ నెల 20 న అరవింద సమేత ఆడియోని విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు.

చిత్ర యూనిట్ నేడు అభిమానులకు సర్ ప్రైజ్ ప్లాన్ చేసింది. అరవింద సమేత చిత్రంలోని తొలి సాంగ్ ని నేడు విడుదల చేయనున్నారు. యూట్యూబ్ లో లిరికల్ వీడియో రూపంలో ఈ సాంగ్ విడుదల కానుండడం విశేషం. ఈ సాయంత్రం 4:05 గంటలకు తొలి సాంగ్ విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.


Click it and Unblock the Notifications











