మజిలీ ఫస్ట్ సింగిల్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న 'వన్ బాయ్ వన్ గర్ల్' సాంగ్!
రియల్ లైఫ్ కపుల్స్ అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా నటిస్తున్న చిత్రం మజిలీ. వీరిద్దరూ వివాహం తర్వార్థ నటిస్తున్న తొలి చిత్రం ఇదే. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శత్వంలో రూపొందుతోంది. ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సమంత, చైతు భార్య భర్తలుగా నటిస్తుండడం విశేషం. ఇటీవల విడుదలైన టీజర్ కూడా ఎమోషనల్ గా ఉంటూ ఆకట్టుకుంది. నాగచైతన్య పాత్రలో పలు వేరియేషన్స్ కనిపిస్తున్నాయి.
క్రికెటర్ కావాలనే యువకుడిగా ఈ చిత్రంలో చైతు నటిస్తున్నాడు. ఏప్రిల్ 5న మజిలీ చిత్రం విడుదల కానుండడంతో ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. తాజాగా ఈ చిత్రంలోని ఫస్ట్ సాంగ్ ని విడుదల చేశారు. వన్ బాయ్ వన్ గర్ల్ అంటూ సాగే ఈ పాట ట్రెండీగా ఉంటూ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీత దర్శకుడు. భాస్కరభట్ల ఈ పాటకు సాహిత్యం అందించారు. గాయకుడు రేవంత్ ఈ పాటని పాడాడు.

దివ్యాన్ష కౌషిక్ ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా నటిస్తోంది. షైన్ స్క్రీన్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. రావు రమేష్, పోసాని ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











