అంతరిక్షంలో వరుణ్ తేజ్ ప్రేమ.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ సాంగ్!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం అంతరిక్షం. ఘాజి చిత్ర దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. అంతరిక్ష పరిశోధన నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అందరిలో ఉత్కంఠ రేపుతోంది. ఇటీవల విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్స్ వేగాన్ని పెంచిన చిత్ర యూనిట్ తాజాగా అందమైన ప్రేమ గీతాన్ని విడుదల చేసింది.
ప్రశాంత్ ఆర్ విహారి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఈ చిత్ర ఆల్బమ్ లోని సమయమా.. సమయమా అంటూ సాగే మొదటి పాటని లిరికల్ వీడియో రూపంలో విడుదల చేశారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మధ్య ఈ పాట సాగుతుంది. సంగీత దర్శకుడు ఈ పాటని అందమైన ప్రేమ గీతంగా మలిచారు. పాట మొత్తం వినసొంపుగా ఉంటూ ఆకట్టుకుంటోంది.

డిసెంబర్ 21న అంతరిక్షం చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ స్పేస్ మిషన్ నేపథ్యంలో సాగే యాక్షన్ సన్నివేశాల్ని అద్భుతమైన విజువల్స్ తో రూపొందించారు. వరుణ్ తేజ్, అతిధి రావు హైదరి ఈ చిత్రంలో వ్యోమగాములుగా కనిపించబోతున్నారు. లావణ్య త్రిపాఠి మరో హీరోయిన్.


Click it and Unblock the Notifications











